సూపర్ స్టార్ మహేష్ కు హిట్టు బాకీ ఉన్నానని తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె సూర్య అన్నారు. విశాల్ హీరోగా ఆధిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన మార్క్ ఆంటోని సినిమాలో ఎస్.జె సూర్య నటించారు. సినిమాలో విశాల్ కు ఈక్వల్ గా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఎస్.జె సూర్య స్పీచ్ తెలుగు ఆడియన్స్ ను అలరించింది. తమిళంలో అజిత్, విజయ్ లాంటి స్టార్స్ కు హిట్ ఇచ్చానని ఇక్కడ పవన్ తో ఖుషి చేశానని మహేష్ తో నాని చేశా కానీ అది ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
మహేష్ కు హిట్ బాకీ ఉన్నానని అన్నారు ఎస్.జె సూర్య. 2004 లో మహేష్ హీరోగా ఎస్.జె సూర్య డైరెక్షన్ లో నాని సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రయోగాత్మకంగా వచ్చినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. మహేష్ సోదరి మంజుల ఆ మూవీ నిర్మించారు. ఆ సినిమా తర్వాత మహేష్ నటించిన స్పైడర్ సినిమాలో ఎస్.జె సూర్య విలన్ గా నటించారు.
అయితే తెలుగులో మళ్లీ డైరెక్షన్ చేస్తే మహేష్ తో సినిమా చేస్తానని ఆయనకు హిట్ ఇవ్వాలని ఉందని అన్నారు సూర్య. అయితే మహేష్ కి హిట్ ఇస్తానని ఎస్.జె సూర్య కామెంట్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.
మహేష్ తో సినిమా చేయాలని సూర్యకి ఉన్నా అది ఇప్పుడప్పుడే కుదిరే పని కాదని చెప్పొచ్చు. ఆల్రెడీ గుంటూరు కారం తర్వాత రాజమౌళి సినిమా ఫిక్స్ చేసుకున్న మహేష్ ఆ సినిమా కోసం ఎలా లేదన్నా రెండు మూడేళ్లు రాసిచ్చేయాల్సిందే.