లేడీ కన్నులు, నెమలి నడక, సివంగి నడుము
మనసుల పరిచయం కంటే మనుషుల పరిచయం గొప్పదా ఏం
మనసెటు పోతే అటు పోరాదని ముని వాక్కు
నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలమే కానీ.. కర్మను పంచుకోలేం
పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను..మీ ప్రేమకు కూడా దూరమైతే
వంటి అద్భుతమైన సంభాషణలు.. అంతకు మించి కళ్లు ఆనందంతో విప్పారే సన్నివేశాలు ఇవన్నీ కలబోసిన చిత్రమే ‘శాకుంతలం’ అని రిలీజ్ ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రతి సన్నివేశాన్ని కుంచెతో బొమ్మ గీసినట్లు అద్భుతంగా తెరకెక్కించారు ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్.
మహాభారతంలోని అద్భుతమైన ప్రేమ కథగా మనం చెప్పుకునే దుష్యంత, శకుంతల ప్రేమగాథను మహా కవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కావ్యంగా రాశారు. దాన్ని ఆధారంగా చేసుకుని సిల్వర్ స్క్రీన్‌పై గుణ శేఖర్ రూపొందించిన విజువల్ వండర్ ‘శాకుంతలం’. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందరూ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆసక్తిని మరో మెట్టుకి తీసుకెళ్లేలా రిలీజ్ ట్రైలర్‌ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు.
శకుంతలంగా సమంత అందం, అమాయకత్వం కలగలిపిన నటన,దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ లుక్.. వారి మధ్య ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగ ప్రయాణం ఎంత హృద్యంగా ఉంటుందనేది ఈ ట్రైలర్‌లో మరోసారి చక్కగా చూపించారు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. దుర్వాస మహామునిగా మోహన్ బాబు.. చిన్ననాటి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇలా ప్రతీ అంశం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
సమంత, దేవ్ మోహన్ నటించిన పౌరాణిక ప్రణయ గాథ ‘శాకుంతలం’. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది.
శాకుంతలం చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వటానికి రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్, హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ వర్క్ చేయటం విశేషం.
సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన శాకుంతలం చిత్రంలో డా.ఎం.మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రలను పోషించారు.