కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయబోతోంది.. ‘వెపన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సత్య రాజ్

మిలియన్ స్టూడియో బ్యానర్ మీద ఎం ఎస్ మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నాడు హైద్రాబాద్‌లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

WEAPON Official Movie Trailer | Sathyaraj,Vasanth Ravi,Rajiv Menon | Ghibran | Manzoor MS | Guhan S

సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘పెన్, మైక్, మీడియా అనేది రియల్ వెపన్. ఓటు అనేది మరో గొప్ప వెపన్. తాన్యా హోప్ ఆంగ్లో ఇండియన్. కానీ తెలుగులో చక్కగా మాట్లాడారు. నేను ‘అందరికీ నమస్కారం’ మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. బాహుబలి సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లింది. ఈ వెపన్ మూవీ కూడా అలాంటి ఓ చిత్రమే. ఇది పెద్ద హిట్ కాబోతోంది. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇదొక కొత్త ట్రెండ్ కాబోతోంది. గుహన్ మంచి కథను రాసుకున్నారు. వసంత్ రవి జైలర్‌లో అద్బుతంగా నటించారు. యంగ్ టాలెంటెడ్ యాక్టర్లతో నటించడం ఆనందంగా ఉంటుంది. నిర్మాత మన్జూర్ ఈ మూవీకి ఎంతో ఖర్చు పెట్టారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. కల్కి సినిమాకు మా చిత్రానికి మధ్యలో 20 రోజులున్నాయి. మా సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.

Actor Sathyaraj Speech At WEAPON Movie Trailer Launch Event | YouWe Media

వసంత్ రవి మాట్లాడుతూ.. ‘ఫ్యాంటసీ యాక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్ అంటూ ఇలా ఇంట్రెస్టింగ్‌గా గుహన్ గారు ఈ కథను రాశారు. కామిక్ స్టైల్లో ఈ మూవీని రాసుకున్నారు. అది చాలా గొప్పగా వచ్చింది. ఈ మూవీలో ఎంతో సీజీ వర్క్ ఉంది. కట్టప్ప పాత్ర తరువాత సత్య రాజ్ గారు మళ్లీ అలాంటి ఓ యాక్షన్ కారెక్టర్‌లో కనిపించబోతోన్నారు. సత్య రాజ్ గారు ఎంతో సెటిల్డ్‌గా నటించారు. ఆయన ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించారు. తమిళంలో కంటే తెలుగులోనే ఈ చిత్రం ఎక్కువగా నచ్చుతుందని యూనిట్ భావించింది. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్‌లా మా సినిమా ఒక సూపర్ హీరో మూవీగా నిలిచిపోతుంది. చిన్న ప్రయత్నమే అయినా కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందో సినిమా చూస్తే తెలుస్తుంది. నాకు పాత్ర నచ్చితే ఎలాంటి కారెక్టర్ అయినా చేస్తాను. లీడ్ రోల్, సైడ్ రోల్ అని ఆలోచించను. నా మనసుకు కథ నచ్చితే సినిమా చేస్తాను. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

Actor Vasanth Ravi Speech At WEAPON Movie Trailer Launch Event | YouWe Media

తాన్యా హోప్ మాట్లాడుతూ.. ‘వెపన్ మూవీ కోసం ఈ రోజు ఇక్కడ ఇలా వచ్చినందుకు ఆనందంగా ఉంది. సత్య రాజ్, వసంత రవి, రాజీవ్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని నా పాత్ర గురించి ఎక్కువగా చెప్పలేను. వెపన్ చాలా కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇదొక యూనిక్ మూవీ. ఈ సినిమా జూన్ 7న రాబోతోంది. అందరూ వెళ్లి మా సినిమాను చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

Actress Tanya Hope Speech At WEAPON Movie Trailer Launch Event | YouWe Media

రాజీవ్ పిళ్లై మాట్లాడుతూ.. ‘ప్రతీ నటుడికి ఓ సూపర్ హీరో మూవీని చేయాలని ఉంటుంది. నాకు అలాంటి ఓ కారెక్టర్ దక్కింది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ఓ మంచి కారెక్టర్ రావడం మామూలు విషయం కాదు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సత్య రాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. వసంత్ రవి, తాన్యా హోప్‌లతో పని చేయడం బాగుంది. మా సినిమాను చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.

Actor Rajeev Pillai Speech At WEAPON Movie Trailer Launch Event | YouWe Media

గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ.. ‘మా కోసం ఈవెంట్‌కు వచ్చిన మీడియాకు థాంక్స్. ఇదొక సైఫై థ్రిల్లర్, యాక్షన్ మూవీ. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన అబ్దుల్, మన్జూర్, అజిజ్ సర్‌కు థాంక్స్. సత్యరాజ్ గారు అద్భుతమైన పాత్రను పోషించారు. ఆయన ఒక లెజెండ్. ఆయనలోని కొత్త కోణాన్ని మీరు ఈ చిత్రంలో చూడబోతోన్నారు. ఈ పాత్రను ఆయన మాత్రమే పోషించగలరని నాకు తెలుసు. అందుకే ఈ పాత్రకు ఆయన్ను మాత్రమే ఊహించుకున్నాను. వసంత్ రవి మంచి పాత్రను చేశారు. సెకండాఫ్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాను ఒప్పుకున్న తాన్యాకు థాంక్స్. ఆమె ఎంతో ఎమోషనల్ పాత్రను పోషించారు. రాజీవ్ ఈ మూవీకి ఎంతో కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రాన్ని రెండో వరల్డ్ వార్‌ను బేస్ చేసుకుని రాసుకున్నాను. ఈ సినిమా కోసం కొన్ని చోట్ల ఏఐ టూల్స్ వాడాం. జూన్ 7 రాబోతోన్న ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’నని అన్నారు.

Director Guhan Senniappan Speech At WEAPON Movie Trailer Launch Event | YouWe Media