నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. హీరో నాని పిడికిలి బిగించి మరో చెత్తో రౌడీని పట్టుకున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంది.
ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళి జి డీవోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్