సిద్ధార్థ్, శ్రీ గణేష్‌, #సిద్దార్థ్ 40- పవర్ ఫుల్ రోల్ లో శరత్ కుమార్

హీరో సిద్ధార్థ్ తన 40వ సినిమా కోసం బ్లాక్ బస్టర్ టీంతో చేతులు కలిపారు. ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ కు ‘8 తొట్టక్కల్’ ఫేం శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ, శాంతి టాకీస్‌ పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్స్ వచ్చింది. ఈ చిత్రంలో స్టార్ట్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఇద్దరి స్టార్స్ ని కలిసి తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#సిద్దార్థ్40 కోసం శ్రీ గణేష్‌ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందబోతోంది.

ఈ చిత్రానికి సంబధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.