నిఖిల్ ‘స్వయంభూ’ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన సంయుక్త

హీరో నిఖిల్ తన 20వ చిత్రం స్వయంభూలో లెజెండరీ యోధుడి పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో అన్ బిలీవబుల్ స్టంట్స్ చేస్తూ కనిపించనున్నాడు.

అతనితో పాటు నటి సంయుక్త కూడా కొన్ని స్టంట్స్ చేయనుంది. అందుకోసం గుర్రపు స్వారీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రారంభించింది. “నా తదుపరి చిత్రం స్వయంభూ కోసం, నేను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. ఇది అభూతమైన ప్రయాణం. మేమంతా ఒక టీమ్ గా కలిసి పనిచేస్తున్నాం” అని తెలిపింది సంయుక్త.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ అత్యుత్తమ సాంకేతిక, ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందుతోంది. .

రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. నిఖిల్‌తో పాటు ఇతర తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నారు.

తారాగణం: నిఖిల్, సంయుక్త

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్ మరియు శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ : ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
DOP: మనోజ్ పరమహంస
డైలాగ్స్: వాసుదేవ్ మునెప్పగారి
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో