Samyuktha: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సంయుక్త

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. హై-ఆక్టేన్ కథలకు పాపులరైన పూరి, తన సిగ్నేచర్ మాస్, కమర్షియల్ స్టయిల్ ని విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో బ్లెండ్ చేసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తారు. అన్ని ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి.

ఈ సినిమాలోని కీలక నటీనటులను నిర్మాతలు ఒకరి తర్వాత ఒకరిని అనౌన్స్ చేస్తున్నారు. టబు, దునియా విజయ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు, టాలీవుడ్ లక్కీ చార్మ్‌గా సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. సంయుక్త పాత్ర కథనంలో కీలకంగా ఉంటుంది. ఎమోషనల్ డెప్త్, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే పాత్రలో కనిపించబోతున్నారు. కథ, ఆమె పాత్రతో సంయుక్త చాలా థ్రిల్ అయ్యింది. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆసక్తిగా వుంది.

ఫస్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్లను ఖరారు చేయడానికి టీం ఇటీవల హైదరాబాద్, చెన్నైలలో రెక్కీని పూర్తి చేసింది. జూన్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సిఈవో: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

దేవర 2 లేనట్టేనా || Cine Critic Dasari Vignan Reveals Shocking Truth About Devara 2 || Telugu Rajyam