వెంకటేష్ ‘సైంధవ్’ నుంచి గాయత్రిగా సారా పరిచయం

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రంలో ‘సైంధవ్‌’గా తన ఫెరోషియస్ షేడ్స్ ఇప్పటివరకు చూశాము. ఇప్పుడు అతని లోతైన భావోద్వేగాన్ని పరిచయం చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని రివిల్ చేశారు మేకర్స్. పోస్టర్‌ లో పాప వెంకటేష్‌ ను కౌగిలించుకోవడం చూడవచ్చు. పోస్టర్ లో వెంకటేష్‌ గాయాలతో కనిపిస్తున్నారు. సినిమాలో సారా పాత్ర పేరు గాయత్రి.

‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుసవిజయాలు అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైంధవ్ హై-ఆక్టేన్ యాక్షన్‌ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సారా పాత్ర హార్ట్ అఫ్ సైంధవ్.

ఈ చిత్రంతో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖ్ వికాస్ మాలిక్ క్యారెక్టర్ లో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో కథానాయికగా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణ్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్
డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ట్యాగ్ మీడియా