ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో వస్తున్న చిత్రం ’రూల్స్ రంజన్’ మరోమారు విడుదల వాయిదా పడిరది.ఇందులో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తుండగా, రత్నంకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్రిష్ గణెళిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లోంచి ’సమ్మోహనుడా…’ అనే పాట ఇప్పటికే చాలా వైరల్ అయింది, చాలామంది ఈ పాటని రీల్స్ కూడా చేసి అభినయిస్తున్నారు.
ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 28న విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు చిత్ర నిర్వాహకులు కొత్త తేదీని ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఈమధ్యనే విడుదలైంది, ఇది ఒక వినోదంతో కూడిన సినిమాగా వస్తోందని అర్థం అయింది.
ఇప్పుడు కొత్త తేదీ ప్రకారం ఈ చిత్రం ను అక్టోబర్ 6న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా నిర్మాతలు తెలిపారు . ఈ మేరకు ఒక ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.ఈ నెల 28న రామ్ పోతినేని ’స్కంద’ ªఖజీనిటజీ విడుదలవుతోంది, అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ’పెదకాపు 1 కూడా ఈనెల 29న వస్తోంది.
రాఘవ లారెన్స్ , కంగనా రనౌత్ లు నటిస్తున్న పి వాసు దర్శకత్వంలో వస్తున్న ’చంద్రముఖి 2’ కూడా 28నే విడుదలవుతోంది. ఇంకో రెండు చిన్న సినిమాలు కూడా వున్నాయి, ఇలా చాలా సినిమాలు ఉండటంతో ’రూల్స్ రంజాన్’ నిర్వాహకులు అక్టోబర్ 6 సరైన తేదీగా నిర్ణయించుకొని అప్పుడు విడుదల చేస్తున్నారని తెలిసింది.