రోషన్ కనకాల ‘బబుల్‌గమ్’ థర్డ్ సింగిల్ జాను డిసెంబర్ 6న విడుదల

రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’ ఇప్పటికే హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. శ్రీచరణ్ పాకాల ‘బబుల్‌గమ్’ కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఫస్ట్ సింగిల్ జిలేబి, సెకండ్ సింగిల్ ఇజ్జత్ పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి

తాజాగా మేకర్స్ ‘బబుల్‌గమ్’ థర్డ్ సింగిల్ ఉప్దేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి మూడో పాట ‘జాను’ డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. జాను పాట మనసుని కదిలించే మెలోడీగా ఉండబోతుంది.

క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా “బబుల్‌గమ్”ను అద్భుతంగా తెరకెక్కించారు. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సరికొత్త రొమాంటిక్ జర్నీతో ప్రేక్షకులని ఆకట్టుకోనుంది. ప్రతిభావంతులైన తారాగణం, అద్భుతమైన టెక్నికల్ టీంతో “బబుల్‌గమ్” తెలుగు సినిమా ప్రపంచంలో తప్పక చూడవలసిన చిత్రంగా వుండబోతుంది.

గరుడవేగ, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ కాగా, ‘తల్లుమల’ ఫేమ్ కేరళ స్టేట్ అవార్డ్ విన్నర్ నిషాద్ యూసుఫ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.

తారాగణం: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: రవికాంత్ పేరేపు
కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని
బ్యానర్లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు
స్క్రీన్ ప్లే కన్సల్టెంట్: వంశీ కృష్ణ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధులిక సంచన లంక
పబ్లిసిటీ డిజైన్: అనంత్ కంచెర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్