ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా ‘రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌’ నుంచి ఎన‌ర్జిటిక్ సాంగ్‌ ‘రైజ్ ఆఫ్ ది డ్రాగన్’ రిలీజ్

దక్షిణాది సినీ రంగం ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఈ హిట్‌ కాంబినేషన్ చేతులు క‌లిపి రూపొందిస్తోన్న చిత్ర‌మే ‘రైజ్ ఆఫ్ ది డ్రాగన్’.

ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీని ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతోన్న 26వ సినిమా ఇది.

కొన్నాళ్లు ముందు రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ సినిమా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియోకు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రైజ్ ఆఫ్ డ్రాగ‌న్ అనే ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌టం అభిమానుల్లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది.

లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్న ఈ మూవీలోని పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌గా.. లియోన్ జేమ్స్‌, న‌దీషా థామ‌స్ పాడారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తొలిసారి ఈ పాట‌లో డాన్స్ చేయ‌టం విశేషం. హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో క‌లిసి ఆయ‌న చేసిన డాన్స్ చూస్తుంటే అంద‌రిలో స‌రికొత్త ఉత్సాహం క‌లుగుతుంది.

ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎం.వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కె.ఎస్‌.ర‌వికుమార్‌, మిస్కిన్‌, వి.జె.సిద్ధు, హ‌ర్ష‌త్ ఖాన్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, క‌యాదు లోహ‌ర్, మ‌రియం జార్జ్‌, ఇందుమ‌తి మ‌ణికంద‌న్‌, తేన‌ప్ప‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.