Mass Jathara Movie Song: రవితేజ ‘మాస్ జాతర’ చిత్రం నుండి మూడవ గీతం ‘హుడియో హుడియో’ విడుదల

‘మాస్ జాతర’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’ గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, మూడవ గీతంగా ‘హుడియో హుడియో’ అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. మాస్ మరియు మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ మనోహరమైన ట్యూన్, అందరినీ కట్టిపడేస్తోంది. ఈ గీతం సినిమా మరియు ఆల్బమ్ రెండింటికీ సరైన భావోద్వేగ లయను తాకుతుంది.

రెండు ఉత్సాహభరితమైన పాటలతో అందరినీ కాలు కదిపేలా చేసిన తర్వాత, ఇప్పుడు శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ఓ మంచి మెలోడీతో వచ్చారు. మునుపటి మాస్ మహారాజా రవితేజను తిరిగి తీసుకొని వస్తున్నట్టుగా మాస్-క్లాస్ కలిసిన ఆరా ఇందులో కనిపిస్తోంది. ఇక శ్రీలీల మరోసారి తెరపై వెలుగులు వెదజల్లారు. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ అందమైన గీతానికి మరింత అందాన్ని తీసుకొని వచ్చింది.

‘హుడియో హుడియో’ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో శ్రావ్యంగా మరియు హుషారుగా ఉండేలా తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ చిత్రానికి తగ్గట్టుగా ఓ సరికొత్త మెలోడీని అందించారు. ఈ సంగీత మాయాజాలానికి తోడు, సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ తన మనోహరమైన స్వరంతో భీమ్స్‌తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. ఇది ఒక చిరస్మరణీయ సంగీత అనుభవాన్ని సృష్టించింది.

దేవ్ రచించిన సాహిత్యం ఉల్లాసంగా, ఆకర్షణీయంగా ఉండి, శ్రావ్యమైన మాధుర్యంతో చుట్టబడి, పాట యొక్క మంచి అనుభూతిని సంపూర్ణంగా సంగ్రహిస్తుంది.

Mass Jathara - Hudiyo Hudiyo Lyrical | Ravi Teja, Sreeleela | Bheems Ceciroleo | Bhanu Bogavarapu

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ‘మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుండి ‘మాస్ జాతర’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన మూడవ గీతం ‘హుడియో హుడియో’ సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మాస్ జాతర

తారాగణం: రవితేజ, శ్రీలీల

దర్శకత్వం: భాను భోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

ఎక్సైజ్ శాఖ ఏంచేస్తుంది | AP Liquor scam Case latest Updates | Telugu Rajyam