రవితేజ, హరీష్ శంకర్, సినిమా అనౌన్స్ మెంట్

మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్‌టైనర్ కోసం మూడోసారి చేతులు కలిపారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది హరీష్. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ మాస్, క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం ధమకేధార్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతోంది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. హరీష్ శంకర్ తన హీరోలను మ్యాసియస్ట్ అవతార్ లో చూపించడంలో దిట్ట. రవితేజతో హరీష్ చేసిన గత చిత్రం ’మిరపకాయ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు, మాసెస్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమా ఎలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుందో తెలియజేయడానికి ..‘ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అని మేకర్స్ అనౌన్స్ చేశారు.

హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం హరీష్ శంకర్ ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారు.

మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: రవితేజ

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం : హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో