రానా నాయుడు సెకండ్‌ సీజన్‌కు రెడీ!

విక్టరీ వెంకటేష్‌ రానా ఇద్దరు దగ్గుబాటి హీరోలు కలిసి చేసిన వెబ్‌ సీరీస్‌ రానా నాయుడు. నెట్‌ ప్లిక్స్‌ వారు నిర్మించిన ఈ సీరీస్‌ నార్త్‌ సైడ్‌ ఆడియన్స్‌ని బాగా మెప్పించింది. కొద్దిగా అడల్ట్‌ డోస్‌ ఎక్కువైందన్న కామెంట్స్‌ వచ్చినా అది హిందీ ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేశారు. అయితే తెలుగులో వెంకటేష్‌ కి ఉన్న ఇమేజ్‌ వల్ల రానా నాయుడు సీరీస్‌ లో ఆ పాత్రను డైజెస్ట్‌ చేసుకోలేకపోయారు. అయితే రానా నాయుడు సీజన్‌ 1 సూపర్‌ సక్సెస్‌ అవడంతో సీజన్‌ 2ని కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రానా నాయుడు సీజన్‌ 2 సినిమా కోసం వెంకటేష్‌, రానా రెమ్యునరేషన్‌ ఎక్కువ డిమాండ్‌ చేసినట్టు తెలుస్తుంది.సీజన్‌ 1 హిట్‌ అవడం ఒక రీజన్‌ కాగా సీరీస్‌ కి ప్రేక్షకులలో ఉన్న డిమాండ్‌ మేరకు వారు రెమ్యూనరేషన్‌ పెంచమని అడిగారట.

అసలైతే వెబ్‌ సీరీస్‌ ల రెమ్యూనరేషన్‌ ఇన్ని సీజన్స్‌ కి ఇంతా అని మాట్లాడుకుంటారు. అయితే కొంతమంది మాత్రం సీజన్‌ సీజన్‌ కి రెమ్యునరేషన్‌ డిసైడ్‌ చేస్తారు. రానా నాయుడు సీజన్‌ 2 కోసం నెట్‌ ప్లిక్స్‌ దగ్గుబాటి హీరోలు అడిగిన రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. సీజన్‌ 1 తరహాలోనే సీజన్‌ 2 కూడా అదే రేంజ్‌ లో ఉంటుందని తెలుస్తుంది. రానా నాయుడు వెబ్‌ సీరీస్‌ సీజన్‌ 2 2024 జనవరిలో స్టీమ్రింగ్‌ అవుతుందని తెలుస్తుంది. సీజన్‌ 1 లో ఉన్న వారితో పాటుగా సీజన్‌ 2 లో కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఇంట్రడ్యూస్‌ అవుతాయని తెలుస్తుంది. ఇక రానా వెంకటేష్‌ సినిమాల విషయానికి వస్తే వెంకటేష్‌ శైలేష్‌ కొలను డైరెక్షన్‌ లో సైంధవ్‌ సినిమా చేస్తున్నాడు.

రానా త్రివిక్రమ్‌ తో హిరణ్యకశ్యప సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. సినిమాల లెక్క ఎలా ఉన్నా రానా నాయుడితో డిజిటల్‌ లో కూడా దగ్గుబాటి హీరోలు తమ సత్తా చాటారని చెప్పొచ్చు. వెంకటేష్‌ కి కొత్తేమో కానీ ఆల్రెడీ రానా హిందీలో కూడా సినిమాలు చేస్తుండటం వల్ల రానా నాయుడు వెబ్‌ సీరీస్‌ రానాకు బాలీవుడ్‌ లో బాగా ప్లస్‌ అయ్యింది. బాహుబలితో ఎలాగు పాన్‌ ఇండియా ఇమేజ్‌ తెచ్చుకున్న రానా ఈ వెబ్‌ సీరీస్‌ తో మరోసారి తన సత్తా చాటాడు. వెంకటేష్‌, రానా మధ్య వచ్చే సీన్స్‌ రానా నాయుడుని నెక్ట్స్‌ లెవెల్‌ లో ఉండేలా చేశాయి. సీజన్‌ 1 కి ఏమాత్రం తగ్గకుండా రానా నాయుడు సీజన్‌ 2 తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.