దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా “రామం రాఘవం” సాంగ్ “తెలిసిందా నేడు” విడుదల !!!

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం “రామం రాఘవం” . నటుడు ధనరాజ్ కొరనాని మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

గురుపూజోత్సవం సందర్బంగా ఈ మూవీ నుండి ‘తెలిసిందా నేడు’ పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఎమోషనల్ గా సాగే ఈ మెలోడీ సాంగ్ విడుదలైన కొద్దిసేపతిలోనే వైరల్ అవ్వడం విశేషం. తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషన్ ను కరెక్ట్ గా కాప్చర్ చేస్తూ చిత్రీకరించిన ఈ సాంగ్ ను అరుణ్ చిలువేరు సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్,సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను అందించగా అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్.

రామం రాఘవం సినిమాలోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు, హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ‘రామం రాఘవం’ తమిళ తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది.