మాచో హీరో గోపీచంద్, ‘రామబాణం’ టీమ్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నెలకొల్పింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కర్నూల్‌లో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హాజరయ్యారు.
మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆల్బమ్ ని స్కోర్ చేశారు. దరువెయ్యరా పాట భక్తిరసంతో పండుగ వైబ్‌ని కలిగి ఉంది. గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ, డింపుల్ హయాతీ, ఇలా అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. వారందరినీ కలసి చూడటమే కన్నుల పండుగలా వుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. నిర్మాత విశ్వ ప్రసాద్ గారితో ఇదే నా మొదటి సినిమా. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకి సినిమాలు అంటే ప్యాషన్. ఆయనకి విజయాలు వస్తున్నాయి. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ఇంకా చాలా పెద్ద నిర్మాత అవ్వాలని, ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ పాటని లాంచ్ చేసిన టీజీ వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. యజ్ఞం సమయంలో ఆయన్ని కలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆయన సాంగ్ లాంచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది. మిక్కీ జే మేయర్ గారు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మిగతా సాంగ్స్ కూడా ఎక్స్ టార్డినరిగా వుంటాయి. హయాతి చాలా బాగా చేసింది. తను పెద్ద హీరోయిన్ అవుతుంది. శ్రీవాస్ తో లక్ష్యం, లౌక్యం లాంటి విజయవంతమైన చిత్రాలు చేశాను. రామబాణం కూడా ఆ స్థాయిలో విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాని చాలా బాగా తీశారు. ఈ సినిమా పని చేసిన అందరూ హార్డ్ వర్క్ చేశారు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో రామబాణం కూడా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.
టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. విశ్వప్రసాద్ గారు ఈ ప్రాంతం వారు, మాకు కుటుంబ సభ్యుడు. ఆయన అన్నీ విజయవంతమైన సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తున్నారు. మనం ఇలానే ప్రోత్సహిస్తూ వుంటే ఇంకా గొప్ప సినిమాలు తీస్తారు. శ్రీవాస్ గారి సినిమాలు చాలా హ్యాపీ గా వుంటాయి. గోపీచంద్ గారి ఎనర్జిటిక్ లెవల్ వేరే లెవల్ ఉంటుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ చేయాలి” అని కోరారు.
దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే రామబాణం దూసుకుపోతుందని ఆనందం వచ్చింది. రామబాణం ఐఫోన్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో పాటని కర్నూల్ వేదికగా విడుదల చేయడం ఆనందంగా వుంది. గోపిచంద్ గారు నేను కలసి సినిమా చేస్తున్నపుడు అభిమానుల, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. అలాంటి పాజిటివ్ వైబ్స్ తో ఈ సినిమా చేశాం. అభిమానుల అంచనాలని అందుకునే కంటెంట్ మా దగ్గర వుంది. మీ అందరి ఆశీస్సులతో రామబాణం నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. డింపుల్ చాలా క్రేజీ గా చేసింది. తను పెద్ద హీరోయిన్ అవుతుంది. విశ్వ ప్రసాద్ గారిది చాలా పెద్ద విజన్. ఇండియాలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బెస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. భవిష్యత్తులో చాలా వండర్స్ క్రియేట్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా వందశాతం మీకు నచ్చుతుంది. గోపీచంద్ గారి ఫ్యాన్స్ కి కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. మే 5న అందరూ రామబాణం చూడాలి” అని కోరారు
డింపుల్ హయాతి మాట్లాడుతూ.. ‘దురువేయ్ రా’ రామబాణం ఆల్బం లో నా ఫేవరేట్ సాంగ్. ఇందులో వింటేజ్ గోపీచంద్ గారు గుర్తుకు వస్తున్నారు. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. మా దర్శకుడు చాలా కేర్ తీసుకొని చేశారు. టీజీ విశ్వప్రసాద్ గారు అద్భుతమైన నిర్మాత. ఆయన ప్రొడక్షన్ లో పని చేయడం ఆనందంగా వుంది. మే 5 అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి” అని కోరారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ .. ఈ పాటని కర్నూల్ లో లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఏదో ఒక ఈవెంట్ కర్నూల్ లో చేయడానికి ప్లాన్ చేస్తుంటాం. అందరూ మే 5న థియేటర్ కి వచ్చి రామబాణం చూడాలి” అని కోరారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్.
ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: వెట్రి పళనిసామి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కథ: భూపతి రాజా
డైలాగ్స్: మధుసూదన్ పడమటి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
పీఆర్వో: ఎల్ వేణుగోపాల్, వంశీ-శేఖర్