రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ సెకండ్ సింగిల్ మార్ ముంత చోడ్ చింత జూలై 16న రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ సెన్సేషనల్ హిట్‌గా మారింది. మేకర్స్ ఇప్పుడు మూవీ సెకండ్ సింగిల్-మార్ ముంత చోడ్ చింత అప్‌డేట్‌ ఇచ్చారు.

మార్ ముంత చోడ్ చింత అనేది ఈ సిరిస్ లో హీరో పాపులర్ డైలాగ్. పోస్టర్ సూచించినట్లు ఈ పాట మాస్ బ్లాస్ట్‌ను అందించబోతోంది. రామ్ రెండు బాటిళ్ల కల్లును ఆస్వాదిస్తూ కనిపించారు. సెట్ వైబ్రెంట్ గా కనిపిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా కనిపించనుంది.

ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫీ అందించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్ట్ 15న గ్రాండ్ గా విడుదల కానుంది.