‘అహింస’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్ చరణ్

యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్టయిన దర్శకుడు తేజ, అభిరామ్ తొలి చిత్రంగా తెరకెక్కుతున్న ‘అహింస’ చిత్రంతో అలరించేందుకు సిద్ధంగా వున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ముందుగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు అహింస థియేట్రికల్ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ సూచించినట్లుగా.. అహింస టిపికల్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కాదు. ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ప్రేమకథ వున్నప్పటికీ, అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ట్రైలర్ సినిమాలోని విభిన్న కోణాలను ప్రజంట్ చేసింది

అభిరామ్‌ని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం, కథానాయకుడిని కొందరు క్రిమినల్స్ వెంబడించడంతో క్రైమ్ థ్రిల్లర్‌గా ట్రైలర్ మొదలవుతుంది. ఒక ప్రముఖ క్రిమినల్ లాయర్ అభిరామ్ కేసును టేకప్ చేయడానికి నిరాకరించడంతో అభిరామ్ ని కాపాడటానికి యంగ్ లాయర్ సదా వస్తుంది. ట్రైలర్‌.. విలేజ్ లో అభిరామ్ , మరదలు గీతికల అందమైన ప్రేమకథను కూడా చూపిస్తుంది. తన కష్టాలు నుంచి బయటపడటానికి శ్రీకృష్ణుని మార్గాన్ని అవలంబిస్తాడు అభిరామ్.

ట్రైలర్‌ను పరిశీలిస్తే, దర్శకుడు తేజ విభిన్నమైన కథాంశంతో ముందుకు వచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం క్రైమ్ అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుంది. అభిరామ్ చాలా షేడ్స్‌తో కూడిన ఇంటెన్స్ క్యారెక్టర్‌లో అద్భుతంగా కనిపించాడు. ఇందులో గీతిక అతని ప్రేయసిగా ఆకట్టుకుంది. సదా లాయర్‌గా కీలకమైన పాత్రలో కనిపించారు.

ఆర్‌పి పట్నాయక్ తన అద్భుతమైన బిజిఎమ్‌తో విభిన్న మూడ్‌లను సెట్ చేశాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీ వుంది. టీజర్‌పై మంచి అంచనాలు నెలకొల్పగా, ట్రైలర్ క్యూరియాసిటీని మరింత పెంచింది.

ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

త్వరలోనే సినిమాను థియేటర్లలోకి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
నిర్మాత: పి కిరణ్
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
డీవోపీ : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
సాహిత్యం: చంద్రబోస్
ఆర్ట్: సుప్రియ
యాక్షన్ డైరెక్టర్: బివి రమణ
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: శంకర్
సిజి: నిఖిల్ కోడూరి
పీఆర్వో: వంశీ-శేఖర్