సితార ఎంటర్టైన్‌ మెంట్స్‌ జోరు.. ఆ ముగ్గురు హీరోలతో!

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థల పేర్ల లో సితార ఎంటర్టైన్మెంట్ ఒకటి. తెలుగు చిత్రసీమలో టాప్ బ్యానర్లలో ఒకటి. నాగ వంశీ ఆధ్వర్యంలో ఇదీ నడుస్తోంది. ప్రేమమ్, భీష్మ, జెర్సీ, భీమ్లానాయక్ లాంటి సూపర్ హిట్ సినిమాలను మనకు అందించిన మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యానర్. మంచి కంటెంట్ సినిమాల తో పాటు భారీ కమర్షియల్ చిత్రాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇటీవలే ఇంటింటి రామాయణం తో ఓటీటీ లోకి కూడా అడుగుపెట్టింది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28, ధనుష్ తో సర్, సహా పలు చిత్రాలను నిర్మిస్తున్న ఈ నిర్మాణ సంస్థ.. మరిన్ని కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టడానికి భారీగా ప్రణాళికలను రచిస్తోంది. త్వరలోనే మరో మూడు ప్రాజెక్టులను రూపొందించి ఆడియన్స్ కు మరింత దగ్గర అవ్వాలని ఆశిస్తోంది.

ఇప్పటికే ఈ ఏడాది ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్న మాస్ మహారాజా రవితేజతో భారీ సినిమా చేయాలని ప్లాన్ చేస్తుందట. అలాగే వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్, మరో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తో ఓ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇది కనుక నిజమైతే ఎలాంటి ప్రాజెక్టులను నిర్మిస్తుందో ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. మరో సినిమాను కూడా విడుదలకు సిద్ధం చేశాడు. అదే రావణసుర సినిమా. ఇది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విశ్వక్ సేస్ ప్రస్తుతం ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ.. హీరోగా చేస్తున్నాడు. ఈ కుర్ర హీరో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపక్ష సినిమాతో వస్తున్నాడు.