‘గామి’ టీమ్‌పై ప్రశంసలు కురిపించిన ‘ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ ఎస్ఎస్ రాజమౌళి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’ మార్చి 8 న మహా శివరాత్రి నాడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. పలువురు సెలబ్రిటీల నుంచి ప్రోత్సాహకరమైన మాటలు కూడా సినిమాకి గొప్పగా హెల్ప్ అయ్యాయి. ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించగా, వి సెల్యులాయిడ్ సమర్పిస్తున్నారు.

తాజాగా ‘ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ ఎస్ఎస్ రాజమౌళి గామి టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.“అసాధ్యమైన కలని సాకారం చేయాలంటే అహర్నిశలు కష్టపడాలని నిర్మాత కార్తీక్ , దర్శకుడు విద్యాధర్ నన్ను కలుసుకుని, అద్భుతమైన విజువల్స్ సాధించడంలో వారి 4 సంవత్సరాల కృషి గురించి మాట్లాడినప్పుడు అనిపించింది. మార్చి 8న విడుదల కానున్న #గామి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు” అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు రాజమౌళి.

రాజమౌళి హృదయపూర్వక అభినందనపై ఆనందం వ్యక్తం చేసిన విశ్వక్ సేన్, దర్శకధీరుడికి ధన్యవాదాలు తెలిపారు. “ఇది గాడ్ మ్యాన్ రాజమౌళి గారి నుంచి వచ్చింది. చాలా థాంక్స్ సర్”అని కృతజ్ఞతలు తెలిపారు విశ్వక్.

అంతకుముందు ప్రభాస్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ఇంకా పలువురు సెలబ్రిటీలు టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.