ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకున్న “హను-మాన్”

యువ కథా నాయకుడు తేజ సజ్జ టైటిల్ రోల్‌లో నటించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం “హను-మాన్” దేశీయ మరియు విదేశీ మార్కెట్‌లలో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు.

సంక్రాంతి స్పెషల్ గా జనవరి 11 ప్రీమియర్స్ బ్లాక్బస్టర్ టాక్ తో విడుదల అయిన ఈ చిత్రం అదే జోరును కొనసాగిస్తోంది.

ఈ చిన్న సినిమా స్టార్ హీరో సినిమాలా అద్భుతాలు చేస్తూ రోజురోజుకు భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం నిజానికి అన్ని చోట్లా టాప్ ట్రెండింగ్ లో ఉంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంది.ఈ స్కేల్ బడ్జెట్‌ సినిమా కు ఇది భారీ విజయం అనే చెప్పాలి.

“హను-మాన్” సినిమా ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి అక్కడ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.