తొలి ఇండిపెండెంట్ చిత్రం ‘బంధం రేగడ్’ తో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సాహిత్ మోత్ఖురి రెండో చిత్రం ‘సవారీ’ తో బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తన మూడవ చిత్రంతో రాబోతోంది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు బ్యానర్‌ల నుంచి ప్రొడక్షన్ నెం. 1 గా వస్తున్న ఈ చిత్రానికి ‘పొట్టేల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా టైటిల్ ని లాంచ్ చేశారు.
గ్రామీణ ప్రాంతంలో బోనాలు ఉత్సవాలు, వేడుకల్లో మేకను బలి ఇవ్వడం, జోగిని రంగం ప్రదర్శించడం వంటి వేడుకలను ఎమోషన్ పోస్టర్ ఆసక్తిగా ప్రజెంట్ చేసింది. యూనిక్ కంటెంట్ తో మోషన్ పోస్టర్ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల భార్య భర్తలుగా ఉత్సవాల్లో క్రతువులు నిర్వహిస్తూ కుమార్తెతో కలిసి కనిపించడం క్యురియాసిటీని పెంచింది.
ఫస్ట్ ఇంపాక్ట్ ఈవెంట్ లో ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. పొట్టేల్ ఫస్ట్ లుక్ వీడియో చాలా ఇంపాక్ట్ ఫుల్ గా అనిపించింది. ఈ సినిమా షూటింగ్ చూడటానికి వికారాబాద్ వెళ్లాను. ప్రేక్షకులకు ఒక మంచి కథని చూపించడానికి టీం యూనిట్ అంతా చాలా కష్టపడి పని చేసింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చి పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. యువ చంద్ర కృష్ణ బంధం రేగడ్ లో చాలా చక్కని నటన కనబరిచాడు. ఈ సినిమాతో ఆకట్టుకుంటాడు. సాహిత్ చాలా ప్రతిభ గల దర్శకుడు. తనకి ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిశాంక్ కి థాంక్స్. ఈ జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.
అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ఫస్ట్ ఇంపాక్ట్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది నచ్చితే నెక్స్ట్ వచ్చే సాంగ్స్, ట్రైలర్, సినిమాకి సంబందించిన ప్రతి అప్డేట్ నచ్చుతుంది. సినిమా ఇంకా నచ్చుతుంది. ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం కావాలి” అన్నారు.
యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నపుడే పాటి ఒక్కరూ చాలా మోటివేటెడ్ గా పని చేశారు. వందశాతం ఒక మంచి సినిమా చేస్తున్నామనే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కనిపించింది. నటీనటులంతా అద్భుతంగా నటించారు. వినోదంతో పాటు మంచి కాజ్ కోసం చేసిన చిత్రమిది. మీ అందరికీ సినిమా చూపించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ” అన్నారు
దర్శకుడు సాయి సాహిత్ మోత్ఖురి మాట్లాడుతూ.. ప్రణయ్ అన్న ఈ వేడుకకు రావడంతో పండగ కళ వచ్చింది. పొట్టేల్ కథ రాసినప్పుడు ఎంత హై ఫీలయ్యానో అదే హై ఈ రోజు వరకూ వుంది. నిర్మాతలు నిశాంక్, సురేష్ ఎంతగానో సపోర్ట్ చేశారు. చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. యువ చంద్ర ఈ చిత్రంతో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాడు. అనన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇందులో అజయ్ గారు ఒక ప్రత్యేకమైన పాత్ర చేశారు. తన నట విశ్వరూపం చూపించబోతున్నారు. ఆయన లుక్ రివిల్ కోసం ప్రత్యేక ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బేబీ తనస్వి చాలా చక్కగా నటిచింది. సంగీతం శేఖర్ చంద్ర మోనిష్ భూపతి రాజు, కార్తీక శ్రీనివాస్ ఇలా మా టెక్నిషియన్స్ అంతా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమా ఖచ్చితం మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు
నిర్మాత నిశాంక్ మాట్లాడుతూ.. నేను-సాహిత్ .. పాతికేళ్ళుగా కలసి ప్రయానిస్తున్నాం. ప్రణయ్ అన్న మాకు ఎంతగానో సపోర్ట్
చేశారు. ఈ ఇంపాక్ట్ కి మించి సినిమా వుంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. ఈ సినిమాతో సాహిత్ రూపంలో ఒక గొప్ప దర్శకుడు రాబోతున్నాడు. అందరూ గర్వపడే సినిమా తీశాడు. ఈ సినిమా చాలా రోజు గుర్తుండిపోతుంది” అన్నారు
నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. ప్రణయ్ అన్న వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. ఈ ఫస్ట్ ఇంపాక్ట్ కి మించి సినిమా వందరెట్లు ఉండబోతుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సేన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం – సాహిత్ మోత్ఖురి
నిర్మాతలు – నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
బ్యానర్లు – నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
సంగీతం – శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ – మోనిష్ భూపతి రాజు
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
లిరిక్స్ – కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
ఫైట్స్ – పృథ్వీ, రబిన్ సుబ్బు
పీఆర్వో- వంశీ శేఖర్