‘స్వయంభూ’ నుంచి సంయుక్త పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల

హీరో నిఖిల్, భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తన ల్యాండ్‌మార్క్ 20వ సినిమా ‘స్వయంభూ’ కోసం నెల రోజుల పాటు కఠోర శిక్షణ కోసం ఇటీవలే వియత్నాం వెళ్లారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. నిఖిల్ లెజెండరీ యోధుడి పాత్రలో నటించేందుకు ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో నిఖిల్ ఎక్స్ టార్డినరీ స్టంట్స్ చేయబోతున్నారు.

లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే.. అందం, అభినయంతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్న సంయుక్త ఈ చిత్రంలో నిఖిల్ సరసన కథానాయికగా నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక పెద్ద కోట ముందు నిండైన ఆభరణాలతో విగ్రహ రూపంలో యువరాణిలా కనిపిస్తున్నారు సంయుక్త. ఆమె చేతిలో ఒక పక్షి కూడా వుంది. సంయుక్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘స్వయంభూ’ హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు మేకర్స్. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.

తారాగణం: నిఖిల్, సంయుక్త

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డీవోపీ: మనోజ్ పరమహంస
డైలాగ్స్: వాసుదేవ్ మునెప్పగారి
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో