అనుప్ రుబెన్స్ స్వరపరిచిన ‘ఓ మంచి ఘోస్ట్’ నుంచి “పైసా రే పైసా” ప్రోమో సాంగ్

తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న చిత్రం “ఓఎంజీ”. సంగీతప్రియులను ఉర్రూతలూగించే మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్స్ సమర్పణలో, మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మాతగా, శంకర్ మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఓఎమ్ జీ. ఓ మంచి ఘోస్ట్” అనే ట్యాగ్ లైన్ తో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులను అలరించాడానకి అనుప్ రుబెన్స్ స్వరపరిచిన ఓ సాంగ్ ను విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. “పైసా రే పైసా” అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్ గా రూపోందించారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్సే స్వయంగా రచించి, పాడటం విశేషం. “పైసా రే పైసా” అంటూ ఈ సాంగ్ లో మనిషి నిజజీవితంలో డబ్బు విలువను, డబ్బు అవసరాన్ని గురించి చాలా బాగా రాశారు. శ్రోతలకు ఇప్పటికే సాంగ్ ప్రోమో తెగ నచ్చేసింది. ఇక ఫుల్ సాంగ్ కోసం అందరూ తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ఫుల్ సాంగ్ విడుదల కాబోతుంది. హర్రర్ కామెడీ జోనర్ లో.. ఆద్యాంతం ఉల్లాసంగా, అంతే ఉత్కంఠంగా సాగే ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించాడానికి ఇలాంటి పాటలు కూడా ఉండటం విశేషం.

ఈ పాట మొత్తం చూశాక సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడుతాయని “ఓఎమ్ జీ” మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తెలుగు సెన్సెషనల్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ ఫస్ట్ లుక్ సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. “ఓ మంచి ఘోస్ట్” అనే ట్యాగ్ లైన్ చాలా క్యాచీగా ఉండటంతో సర్వత్ర సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమాలో ప్రధాన తారగణం వెన్నెల కిశోర్, శకలక శంకర్, కమెడియన్ రఘు తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తుంది.

తారాగణం : వెన్నెల కిశోర్, శకలక శంకర్, నిదిత శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ, రఘు బాబు, నాగినీడు, బహుబలి ప్రభాకర్, శేకింగ్ శేషు తదితరులు,

సంకేతికనిపుణులు : సినిమాటోగ్రఫర్ : ఐ ఆండ్రూ, మ్యూజిక్ డైరెక్టర్ : అనుప్ రుబెన్స్, ఆర్ట్ డైరెక్టర్ : సుప్రియా, ఎడిటర్ : ఎమ ఆర్ వర్మ, కొరియోగ్రాఫర్: గ బాబా భాస్కర్ , విజువల్ ఎఫెక్ట్ : విక్టర్, కళ్యాణ్, విజయ్, డైరెక్టర్ :శంకర్ మార్తాండ్, ప్రొడ్యూసర్ :డాక్టర్ అబినికా ఐనభాతుని