ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమా ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. మార్చిలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి పలు విశేషాలను యూనిట్‌ మీడియాతో పంచుకుంది.

ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ… గత 46 సంవత్సరాలుగా నటుడిగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు ధన్యవాదాలు. నేను ఇంతకాలం కొనసాగటానికి నేను నమ్ముకున్న కామెడీనే. ఇటీవలే వాల్తేర్‌ వీరయ్య వంటి హిట్‌ ఇచ్చారు. మాయలోడు, రాజేంద్రుడు`గజేంద్రుడుతో నా కామెడీకి బ్రాండ్‌ను క్రియేట్‌ కావడంలో ముఖ్యపాత్ర వహించిన వారిలో ముఖ్యులు ఎస్‌.వి. కృష్ణారెడ్డి గారు. సాక్షాత్తూ నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు ‘‘దిస్‌ బాయ్‌ ఈజ్‌ స్ట్రెస్‌ రిలీజర్‌’ అన్నారంటే ఎంత గొప్ప విషయం. అలాగే ప్రఖ్యాత యూనివర్సీటీ అయిన ఆంధ్రా యూనివర్సిటీవారు 42 సంవత్సరాల వయస్సులోనే నాకు డాక్టరేట్‌ ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అందరినీ అలరించే చిత్రాలతో విజయవిహారం చేసిన ఎస్‌.వి.కృష్టారెడ్డిగారు, నేను, అచ్చిరెడ్డిగారు మళ్లీ ఇంతకాలం తర్వాత కల్పన గారి నిర్మాణంలో కల్పనచిత్ర పతాకంపై ‘ఆర్గానిక్‌ మామా`హైబ్రీడ్‌ అల్లుడు’తో మరో విజయ విహారానికి సిద్ధం అవుతున్నాము.

ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేసిన మేము.. ఈ సినిమాను కూడా అంతే సంస్కారవంతంమైన కేటగిరీ సినిమాగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం ఇది వంద శాతం ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌. నిర్మాత కల్పన గారు నాకు చిన్నతనం నుంచీ తెలుసు. వాళ్ల నాన్నగారు నిర్మాత కూడా. మీనా కెరీర్‌ ప్రారంభంలో నాతో చేసింది. మళ్లీ ఇంతకాలానికి మా కాంబినేషన్‌ కుదిరింది. ఆమెకు అనుకోని కష్టం వచ్చినా నిర్మాత శ్రేయస్సు కోసం వీలైనంత త్వరగా షూటింగ్‌కు హాజరైంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లతో పనిచేయడం వల్ల ఆమెకు ఆ మంచి గుణం అబ్బింది. ఆమెకు ఈ సందర్భంగా బ్లెస్సింగ్స్‌ చెపుతున్నా. హీరో సొహైల్‌ తన పాత్రకు చెందిన అన్ని రసాలను అద్భుతంగా పండిచాడు. సినీ పరిశ్రమలో యాక్టర్‌ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్‌ కావాలి. అది ఉంటే ఇక తిరుగుండదు అని ఈతరం ఆరిస్ట్‌లకు చెపుతున్నా. మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా వారి పరిధిలో అద్భుతంగా చేశారు. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి అన్నారు.

దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ… వినోదం తర్వాత నేను చేసిన కంప్లీట్‌ కామెడీ మూవీ ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రీడ్‌ అల్లుడు’. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు, మంచి డైలాగ్స్‌కు స్కోప్‌ ఉన్న కథ ఇది. మీకు నచ్చే అన్ని అంశాలనూ పుష్కలంగా ఏర్చి కూర్చిన సినిమా ఇది. రాజేంద్రప్రసాద్‌ గారి గురించి తెలుగు ప్రేక్షకుకు నేను చెప్పేదేముంది. ఆయన నిలబెట్టిన దర్శకుణ్ణి నేను. ఇక మా అచ్చిరెడ్డి గురించి నేను పెద్దగా చెప్పక్కర్లా. ఈ సినిమాకు సంబంధించి నా చేత అద్భుతాలను సృష్టించే ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే నిర్మాత కల్పన గారి సహకారం ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు కథ విపరీతంగా నచ్చడంతో బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యారు. ఇక కెమెరామెన్‌ రాంప్రసాద్‌ గారు సినిమాను కలర్‌ఫుల్‌గా మలిచారు. మిగిలిన టెక్నీషియన్స్‌ కూడా తమ శక్తికి మించి పనిచేశారు. ఓవైపు రాజేంద్రప్రసాద్‌, మీనాగారు.. మరోవైపు సూర్య, హేమ, సునీల్‌, కృష్ణభగవాన్‌, ప్రవీణ్‌, సప్తగిరి ఒక్కరేమిటి కమెడియన్స్‌ అందరూ కలిసి సినిమాను పీక్స్‌కు తీసుకెళ్లారు. థియేటర్‌లో ప్రేక్షకులు నవ్వే నవ్వులు చూసి ముచ్చటపడి పోవటానికి ఎదురు చూస్తున్నాను అన్నారు.

నటి మీనా మాట్లాడుతూ… ఈ కథ చెపుతున్నప్పుడే డైరెక్టర్‌ గారు నాకు ఆ క్యారెక్టర్‌ ఎలా మాట్లాడుతుంది.. ఎలా బిహేవ్‌ చేస్తుంది అని ప్రాక్టికల్‌గా కూడా చూపించారు. అంతగా మాకన్నా కృష్ణారెడ్డిగారే ఈ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ అయిపోయారు. నాకు ఇది కొత్త క్యారెక్టర్‌గానే చెప్పాలి. రాజేంద్రప్రసాద్‌ గారితో 30 సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. కృష్ణారెడ్డిగారితో వర్క్‌ చేయాలని చాలాసార్లు అనుకున్నా డేట్స్‌ ప్రాబ్లమ్‌తో కుదరలేదు. ఆయన శుభలగ్నం సినిమా ఏదైనా భాషలోకి రీమేక్‌ చేస్తే నేను చేస్తాను అని ఆయన్న అడిగాను. కానీ కుదరలేదు. ఇక రాజేంద్రప్రసాద్‌ గారు గ్రేట్‌ యాక్టర్‌.. గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్‌ కూడా. నేను తొలిసారిగా ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో పనిచేస్తున్నాను. ఆమెతో చాలా మంచి అనుబంధం ఏర్పడిరది. ఇద్దరం షాపింగ్‌క కూడా వెళ్లేవాళ్ళం. ఇలాంటి మంచి సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.

హీరో సోహైల్‌ మాట్లాడుతూ…. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను. కృష్ణారెడ్డి గారి సినిమాలు, రాజేంద్రప్రసాద్‌ గారి సినిమాలు చూసి పెరిగినోళ్లం. ఇంతమంది లెజెండరీ నటీనటులు, టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేయడానికి ముందు భయపడ్డా. నువ్వు సీనియర్స్‌తో చేస్తున్నావా? జూనియర్స్‌తో చేస్తున్నావా అనేది వదిలేసి.. కెమెరాను, ప్రేక్షకుల్నే దృష్టిలో పెట్టుకో అని కృష్టారెడ్డిగారు చెప్పారు. ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్‌, డైలాగ్‌ డెలివరీ అంతా కృష్ణారెడ్డిగారి క్రెడిట్టే. అచ్చిరెడ్డిగారి ప్లానింగ్‌ వల్లే ఇంత పెద్ద ప్యాడిరగ్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికీ సినిమాను 39రోజుల్లో కంప్లీట్‌ చేశారు. నిర్మాత కల్పన మేడమ్‌ కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. నాకు ఈ అవకాశం రావటానికి కారణమైన సంతోషం సురేష్‌ గారికి థ్యాంక్స్‌. కృష్ణారెడ్డి గారి వింటేజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మళ్లీ ఇందులో చూస్తారు అన్నారు.

నటి హేమ మాట్లాడుతూ… 1990 నుంచి నేను సినిమాలు చేస్తున్నప్పటికీ కృష్ణారెడ్డిగారి సినిమాలో చేసే అవకాశం ఈ సినిమాతో రావడం ఆనందంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్‌ గారితో ఇంతకు ముందు చాలా సినిమాలు చేశాను. ఆయన ప్రతి ఆర్టిస్ట్‌కు నటనలో మెళకువలు చెపుతుంటారు. కల్పన మేడమ్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సోహెల్‌ హీరోగా ఈ సినిమాతో నిలదొక్కుకుంటాడు. ఈ జనరేషన్‌ యూత్‌కు దగ్గరగా ఉండే తల్లిపాత్ర నాది. ఈ సినిమా ఓ మంచి కనుల విందు అన్నారు.

ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ… సినిమా బాగా వచ్చింది. మార్చిలో విడుదల చేయటానికి నిర్మాత కల్పన గారు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ చెప్పినట్లు ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కృష్ణారెడ్డిగారి గత చిత్రాల్లోని మ్యాజిక్‌తో పాటు మంచి మెసేజ్‌ ఉన్న స్క్రిప్ట్‌ ఇది. కల్పన గారు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే సినిమా ఇంత తొందరగా హ్యాపీగా పూర్తయింది. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. రాజేంద్రప్రసాద్‌ గారు, మీనా గారి గురించి కొత్తగా చెప్పాల్సిపని లేదు. అందరూ మంచి ఆర్టిస్ట్‌లే.. ఒకర్ని మించి ఒకరు పోటీ పడి చేశారు. సొహైల్‌ ఈ క్యారెక్టర్‌కు హండ్రడ్‌పర్సంట్‌ సూటబుల్‌. అతను 100 శాతం అవుట్‌పుట్‌ ఇచ్చాడు. హీరోయిన్‌ మృణాళిని రవి చక్కగా చేసింది. క్లైమాక్స్‌లో వచ్చే మంచి మాస్‌ సాంగ్‌ అందరికీ సూపర్‌ కిక్‌ ఇస్తుంది. ఈ పాట రాసింది చంద్రబోస్‌ గారు, పాడింది రాహుల్‌ సిప్లిగంజ్‌, కొరియోగ్రఫీ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్‌.ఆర్‌.ఆర్‌.లోని ‘‘నాటు నాటు’’ పాట ఎంత సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. ఈ సాంగ్‌ కూడా మంచి బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ… సినిమా నేను చూశాను అద్భుతంగా ఉంది. కృష్ణారెడ్డి గారి మార్క్‌ సినిమా అంటే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకటే.. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేయటమే ఆయన లక్ష్యం. ఈ సినిమా కూడా అదే కోవలో ఉంటుంది. నిర్మాత కల్పన గారు చేస్తున్న తొలి స్ట్రెయిట్‌ సినిమా. మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చక్కని ట్రీట్‌ ఇవ్వబోతున్నారు కృష్ణారెడ్డిగారు అన్నారు.

సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: శివ, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.