2 మిలియన్ల వ్యూస్ చేరువలో ‘ఓ మంచి ఘోస్ట్’ చిత్రం నుంచి సాంగ్.

ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు. ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్ తో “ఓ మంచి ఘోస్ట్”(OMG) చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ నెట్టిట్లో రచ్చ చేస్తుంది. త్వరలో మనముందుకు రాబోతున్న “ఓ మంచి ఘోస్ట్” సినిమాలో ప్రస్తుతం డబ్బు ప్రాముఖ్యతపై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి పాడారు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ తో పాటు శ్రీనివాస్ చింతల ఈ పాటకు రచయితలుగా పనిచేశారు. మంచి బీట్ తో ఉన్న ఈ సాంగ్ కు డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ కొరియోగ్రాఫీ పై ఈ పాట… డబ్బు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెబుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

‘డబ్బు చుట్టు లోకం తిరుగుతుంది.. నీతో పట్టి చాకిరి చేస్తుంది… రౌండు రౌండ్… గోల్ తిప్పుతుంది నిన్ను .. మత్తులో ముంచేస్తుంది..’ అంటూ సాగే ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమా నుంచి పైసా రే పైసా రే.. లిరికల్ సాంగ్‌ని మేకర్స్ శనివారం విడుదల చేసారు.

”ఓ మంచి ఘోస్ట్” (OMG) శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించడంతో పాటు పాటకు సాహిత్యం కూడా అందించారు. మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా. అభినికా ఐనాభాతుని ఈ చిత్రానికి నిర్మతగా వ్యవహరిస్తున్నారు.

హారర్ కామెడీగా తెరకెక్కుతున్న OMG “ఓ మంచి ఘోస్ట్” చిత్రం నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుండగా… తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో ఉపేస్తూ.. శ్రోతల్ని ఉర్రుతలుగిస్తుంది. ఈ చిత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ కథలో కామెడీతో పాటు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే హారర్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

ఈ చిత్రంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందితా శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని, హాస్యనటుడు రఘుతో పాటు పలువురు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నటీనటులు: వెన్నెల కిషోర్, శకలక శంకర్, రజిత్ రాఘవ్, రఘు బాబుల, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు.

దర్శకుడు: శంకర్ మార్తాండ్
నిర్మాత: డా.అబినిక ఐనాభాతుని
బ్యానర్: మార్క్ సెట్ నెట్ వర్క్స్
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
ఎడిటర్: ఎమ్ ఆర్ వెర్మ
ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పాట రచయిత: అనూప్ రూబెన్స్, శ్రీను చింతల
కొరియోగ్రఫర్: బాబా భాస్కర్
విజువల్ ఎఫఎక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్
పీఆర్ఓ: హరీష్ – దినేష్
డిజిటల్ పీఆర్ఓ: మనోజ్ తాడి

Paisa Re Lyrical Video-OMG (O Manchi Ghost)  | Vennela,Shakalaka |Anup R |Marthand KS | Dr. Abinika