శ్రీ విష్ణు, ప్రియదర్శి, ‘ఓం భీమ్ బుష్’ ఫస్ట్ సింగిల్ బ్యాంగ్ బ్రోస్ విడుదల

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ‘ఓం భీమ్ బుష్’ అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ‘ఓం భీమ్ బుష్’ ఫస్ట్ సింగిల్ బ్యాంగ్ బ్రోస్ పాటని విడుదల చేసిన మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. సన్నీ ఎం.ఆర్ ఈ పాటని లైవ్లీ గా కంపోజ్ చేశారు. లక్ష్మీ ప్రియాంక అందించిన లిరిక్స్ చాలా క్యాచిగా వున్నాయి. ఆదిత్య అయ్యంగర్, డింకర్ కల్వల, వివేక్ హరిహరన్, రుత్విక్ తలశిల్కర్, సన్నీ M.R కలసి డిలైట్ ఫుల్ గా అలపించారు.

ఈ పెప్పీ నంబర్‌లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఈ ముగ్గురి డ్యాన్స్ మూమెంట్స్ మేజర్ హైలెట్. ముగ్గురూ కలర్‌ఫుల్‌ దుస్తుల్లో మెరిసిపోతుంటే, ప్రియా వడ్లమాని తన గ్లామర్‌ తో ఆకట్టుకున్నారు. వైబ్రెంట్ అండ్ లావిష్ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది.

ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ కాగా, విజయ్ వర్ధన్ ఎడిటర్.

‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
ప్రెజెంట్స్: వి సెల్యులాయిడ్
నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు
డీవోపీ: రాజ్ తోట
సంగీతం: సన్నీ MR
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్: విజయ్ వర్ధన్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో