పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యమీనన్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పుటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి భారతీయుడికి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. సాంకేతికంగా, యుద్ధ సన్నివేశాల పరంగా సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిఖిల్ యాక్షన్‌కు తోడు దగ్గుబాటి రానా కూడా ట్రైలర్ చివర్లో కనిపించడంతో సినీ ప్రియుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ‘స్వతంత్రమంటే ఎవరో ఇచ్చేది కాదు.. మనం లాక్కుంటే వచ్చేది’ అంటూ ట్రైలర్ ఎండింగ్‌లో రానా చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సత్యం మాల్‌లోని ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా ఉంది. చంద్రబోస్ గారి జీవితంలో ఒక చాప్టర్ ను మా సినిమాలో చూపించాము. ఇది చంద్రబోస్ గారి బయోపిక్ కాదు. ఈ నెల 29న తప్పకుండా థియేటర్లలో చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ పొందుతారు.’’ అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘‘మాకెవరికీ సరిగ్గా నిద్ర లేదు. ఇలాంటి సినిమాలు అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఈ మూవీలో నేను రెండు పాటలు చేశాను. త్వరలో ఒక బ్యాంగర్ సాంగ్ రిలీజ్ అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సస్, ఎమోషనల్ స్టఫ్ తో సాంగ్స్ ఉంటాయి. ఈ సినిమాకు పని చేయడం సంతోషంగా ఫీలవుతున్నా.’’ అన్నారు.
సీఈవో చరణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమాకు ఇంత హైప్ రావడానికి మీడియా చేసిన సపోర్టే కారణం. నిఖిల్ భయ్యా సపోర్ట్ చాలా ఉంది. క్వాలిటీ పరంగా ఈ సినిమా చాలా బాగుంది. స్పై నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ను అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఒక బెస్ట్ రిలీజ్ జరుగుతుంది. ఈ సినిమాలో రానా గారు యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు పెద్ద థ్యాంక్స్. ఆయన పాత్ర ఎంత బాగుంటుందో సినిమాలో మీరే చూస్తారు. నిఖిల్ గారికి ది బెస్ట్ థియేటర్స్ ఇస్తున్నాం. ప్రతి కంట్రీలో, ప్రతి స్టేట్‌లో అన్ని లాంగ్వేజస్‌లో ది బెస్ట్ క్వాలిటీతో, ది బెస్ట్ స్టోరీతో హండ్రెడ్ పర్సెంట్ హిట్ కొట్టబోతున్నాం.’’ అన్నారు.
నటి సానియా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా తెలుగులో నాకు మొదటిది. నిఖిల్ చాలా సపోర్ట్ చేశారు. ఐశ్వర్య బెస్ట్ కోయాక్టర్. అభినవ్ మమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఈ సినిమా చాలా ఇంటెన్స్, ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. ఇది నార్మల్ మూవీ కాదు. ట్రైలర్ చూశారు కదా.. నిఖిల్ గ్రేట్ స్టంట్స్ చేశారు. బీజీఎం, వీఎఫ్‌ఎక్స్ అన్నీ గ్రాండ్ గా ఉన్నాయి.’’ అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. ఇలాంటి టీమ్‌తో వర్క్ చేయడం నా అదృష్టం. నిఖిల్ గారు నిజమైన రాక్‌స్టార్. ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గ్యారీ గారికి రుణపడి ఉంటా. చరణ్ పాకాల గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను అందరూ జూన్ 29న థియేటర్లలో చూడండి.’’ అన్నారు.
హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘‘ఉదయం రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ సాయంత్రం రిలీజ్ చేసినందుకు అందరూ నన్ను క్షమించాలి. మీడియా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. 20 రోజుల నుంచి మా టీమ్ నిద్రలేకుండా పని చేస్తున్నారు. మేము అనుకున్న కథను అనుకున్నట్లు చాలా బాగా తీశాం. సినిమా బాగుంటుందనే నమ్మకంతో బయ్యర్లంతా హ్యాపీగా ముందుకొచ్చారు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాను చివరి నిమిషం వరకు చెక్కుతున్నారు. ఈ సినిమాకు సెన్సార్ నుంచి ఒక్క కట్ కూడా లేకుండా యూ బై ఏ సర్టిఫికెట్ వచ్చింది. హీరోయిన్ లక్ష్మి నిన్న రాత్రి వరకు షూటింగ్‌లో పాల్గొంది. ఇక రానా అన్న కథ చెప్పగానే ఎంతగానో నమ్మి చేశారు. ఆయన నిజంగా సర్‌ప్రైజ్ చేస్తారు. జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అందరినీ ఈ సినిమా ఎంతగానో థ్రిల్ చేస్తుంది.’’ అన్నారు.
అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్రయూనిట్ సమాధానాలిచ్చింది.
ప్రశ్న: సినిమా నేతాజీ డెత్ మిస్టరీ గురించి ఉంటుందా? అది ఒక ట్రాక్ మాత్రమేనా?
సమాధానం: డెత్ మిస్టరీతో పాటు ఆయన ఐడియాలాజీ గురించి కూడా ఈ సినిమాలో ఉంటుంది.
ప్రశ్న: కాంట్రవర్సీ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
సమాధానం: కాంట్రవర్సీలకు మేము దూరంగా ఉంటాం. ఇలాంటి స్టోరీ కచ్చితంగా చెప్పాలనుకున్నాం. చెప్పాం.
ప్రశ్న: రానా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఉందా? చివర్లో యాడ్ చేశారా?
సమాధానం: మొదటి నుంచి అనుకున్నాం. ఒక సూపర్ స్టార్ కోసం క్యారెక్టర్ డిజైన్ చేశాం. రానా గారు అయితేనే బాగుంటుందని ఆయనను ఒప్పించాం.
ప్రశ్న: నేతాజీ డెత్ మిస్టరీపై పొలిటికల్ కాన్స్‌పిరసీ ఉందని అందరికీ తెలుసు? దాన్ని మీరేమైనా టచ్ చేశారా?
సమాధానం: ఆర్టీఐ ద్వారా సుభాష్ చంద్రబోస్ గారి ఫైల్స్ తీసుకుని చూస్తే షాక్ అయ్యాం. నిజానిజాలు నిర్ధారణ చేసుకుని ఉన్నది ఉన్నట్లు చూపిస్తున్నాం. మాకు ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు. ఎవరినీ హర్ట్ చేయకుండా ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా తీశాము.
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యమీనన్, రానా దగ్గుబాటి, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్, సన్య థాకూర్, మక్రంద్ దేశ్ పాండే, జిస్సు సేన్ గుప్తా, నితిన్ మెహ్తా, రవి వర్మ, కృష్ణ తేజ, ప్రిష సింగ్, సోనియా నరేష్, తదితరులు.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు & ఎడిటర్: గ్యారీ బీహెచ్
కథ & నిర్మాత: కే రాజశేఖర్ రెడ్డి
బ్యానర్: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
సీఈవో: చరణ్ తేజ్ ఉప్పాలపాటి
డీఓపీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
ఆర్ట్: అర్జున్ సూరిశెట్టి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: టమాడా మీడియా