‘డంకీ డ్రాప్ 5’ అంటూ విడుదలైన ‘ఓ మాహీ..’ సాంగ్‌కి ట్రెమెండెస్ రెస్పాన్స్..

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా డంకీ డ్రాప్ 5 అంటూ ‘ఓ మాహీ..’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేక్షకులపై మేకర్స్ తమ హద్దుల్లేని ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. హార్డి, మను మధ్య ఉన్న నిస్వార్థమైన ప్రేమను, అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ సాంగ్‌ను ఎడారి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. హార్డి, మను మధ్య శాశ్వతమైన ప్రేమను ఆవిష్కరించే ఈ పాట వారి ప్రయాణంలో అంతర్లీనంగా ఉన్న పోరాటాలను కూడా తెలియజేస్తుంది. పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నెటిజన్స్ ఈ సాంగ్‌ను సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ అభినందిస్తున్నారు. పాటను వింటున్నారికి గూజ్ బమ్స్ వస్తున్నాయి. మరో చార్ట్ బస్టర్ సాంగ్‌తో షారూక్ ఖాన్, అర్జిత్ సాంగ్ కాంబినేషన్‌ను చూసి అభిమానులు, ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు థియేటర్స్‌లో ఈ పాటను చూస్తుంటే ఆడియెన్స్‌కి చక్కటి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుందని అంటున్నారు.

https://x.com/yagaa__/status/1734181294303822241?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

https://x.com/filmyyash/status/1734200603486658789?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

https://x.com/amitrahangdale4/status/1734200496830001555?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

https://x.com/mizsayani/status/1734180836713640246?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

https://x.com/alammiroj/status/1734201216048287882?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.