నేచురల్ స్టార్ నాని ‘HIT: The 3rd Case’ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌ లో ఈ రోజు ప్రారంభం

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) తన 32వ మూవీ HIT: The 3rd Caseలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైయింది. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు నాని. ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్ గా మేకోవర్‌ అయ్యారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

మే 1, 2025న వేసవిలో HIT 3 థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: నాని

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను

నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని

బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్

డీవోపీ: సాను జాన్ వర్గీస్

సంగీతం: మిక్కీ జె మేయర్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)

సౌండ్ మిక్స్: సురేన్ జి

లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధపు

చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల

కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు

SFX: సింక్ సినిమా

VFX సూపర్‌వైజర్: VFX DTM

DI: B2h స్టూడియోస్

కలర్స్: S రఘునాథ్ వర్మ

పీఆర్వో: వంశీ శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో