జనవరి 30న నాని ‘దసరా’ టీజర్ విడుదల

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ తో వచ్చారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇది. అనౌన్స్ మెంట్ వీడియోలో మధ్య వయస్కుడైన గ్రామస్థుడు బీడీ వెలిగించి, అగ్గిపుల్లని విసిరినప్పుడు మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో టీజర్ తేదీని రివిల్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది.

కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్ : విజయ్‌ చాగంటి
ఫైట్స్: రియల్ సతీష్, అన్బరివ్
పీఆర్వో: వంశీ- శేఖర్