Zebra Movie: ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ ‘జీబ్రా‘. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.
టీజర్ జీబ్రా ప్రపంచంలోకి ఒక గ్లింప్స్ అందిస్తుంది. టీజర్ లో బ్లాక్ హార్స్ గా సత్య దేవ్ ఒక MNCలో పనిచేసే వ్యక్తిగా పరిచమయ్యారు. వైట్ హార్స్ గా ధనంజయ ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించారు. సునీల్ ని బ్యాడ్ గాయ్ గా చూపించారు. సత్యరాజ్ వెరీ మ్యాడ్ మ్యాన్. Wi-Fi పాస్‌వర్డ్ చివరి ఎపిసోడ్ నవ్వులని పంచింది.
టీజర్ డబ్బు, కార్లు, ఓడలు, విమానాలు, ఆవుతో సహా అనేక రకాల ఎలిమెంట్స్ ని ప్రజెంట్ చేసింది. ఇవన్నీ కథనానికి కీలకంగా వుంటాయి. ఈశ్వర్ కార్తీక్ కథను వినోదాత్మకంగా ఉంచుతూ డార్క్ బ్యాక్ డ్రాప్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. సత్యదేవ్, ధనంజయ తమ విభిన్న పాత్రలలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటోతో పాటు మిగతా నటీనటులు టీజర్ లో అలరించారు.
Zebra Movie: సత్య దేవ్ ‘జీబ్రా’ గ్లింప్స్ సెప్టెంబర్ 30న రిలీజ్
రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెరేటివ్ ని ఎంగేజింగ్ గా ఉంచింది. సినిమాటోగ్రాఫర్ సత్య పొన్మార్ అందించిన విజువల్స్ అద్భుతంగా వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్. మేకర్స్ ముందుగా అనౌన్స్ చేసినట్లుగా, జీబ్రా అక్టోబర్ 31 న దీపావళి సందర్భంగా అన్ని దక్షిణ భారతీయ భాషలు, హిందీలో థియేటర్లలోకి వస్తుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన రాక్ స్టార్ మనోజ్ మంచు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎస్ ఎన్ రెడ్డి గారు నాకు మంచి శ్రేయోభిలాషి. అలాంటి మంచి వ్యక్తికి మంచి జరగాలనే కోరుకుంటాం. ఈ సినిమా కోసం భారీ గా ఖర్చు చేసి, అందరూ ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. నా ఫేవరట్.. తమ్ముడు సత్యదేవ్. తను వండర్ ఫుల్ యాక్టర్. ఫస్ట్ నుంచి తన యాక్టింగ్ కి నేను ఫ్యాన్ ని. టీజర్ అదిరిపోయింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. వెల్ కమ్ ధనంజయ. సత్యరాజ్ గారి క్యారెక్టర్ వేరే లెవల్ వుంది. దర్శకుడు తెలుగు నేర్చుకొని సినిమా చేయడం హ్యాట్సప్. ఆర్ఆర్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ ఈ కథని జంగిల్, రాబిట్, లయన్ ఇలా క్యారెక్టర్స్ తో చెప్పడం మొదలుపెట్టాడు. జింగిల్ బుక్ తీస్తున్నాడమో నా వాయిస్ కోసం వచ్చాడని అనుకున్నా. తర్వాత అసలు కథ చెప్పాడు. స్టొరీ అదిరిపోయింది. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చిన ఈశ్వర్ కి థాంక్ యూ. తను చాలా క్లాగా రిటీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇందులో చాలా కొత్త క్యారెక్టర్ తో రాబోతున్నాను. చాలా హ్యుజ్ కాస్టింగ్ వున్న సినిమా ఇది. ట్రూ నేషనల్ ఫిల్మ్ ఇది. అన్ని పరిశ్రమల్లో అర్టిస్టులు, టెక్నిషియన్స్ పని ఇందులో పని చేశారు. ఇంత హ్యుజ్ సినిమా తీసిన నిర్మాతలకు థాంక్ యూ. ధన నేను ఒకటే బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాం. మా కెరీర్ గ్రాఫ్ ఒకటే. తనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ధన, నా కెరీర్ లో ఇది మైల్ స్టోన్ ఫిల్మ్. డబ్భు అంటే ఇష్టం వున్న ప్రతి వ్యక్తికి ఈ సినిమా నచ్చుతుంది. డబ్బు మీద చేసిన సినిమా ఇది. వైట్, బ్లాక్ మనీతో పాటు చాలా ఎలిమెంట్స్ మిమ్మల్ని అలరిస్తాయి. సత్యరాజ్ గారు చాలా పెక్యులర్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. మనోజ్ అన్న నాకు ఎప్పుడూ సపోర్ట్ గా వుంటారు. మనోజ్ అన్న సో ట్రూ పర్సన్. థాంక్ యూ మనోజ్ అన్న. జీబ్రా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికీ థాంక్ యూ’ అన్నారు.
హీరో డాలీ ధనంజయ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సత్యదేవ్ ఈ కథ వినమని కాల్ చేశారు. ఈశ్వర్ మైసూర్ వచ్చి ఈ కథ చెప్పారు. చాలా నచ్చింది. వెరీ ఇంటెల్జెంట్ అండ్ సింపుల్ రైటింగ్. ఆడియన్స్ చాలా మంచి సినిమా చూడబోతున్నారు. ఈశ్వర్ చాలా అంకితభావంతో పని చేశారు. సత్యదేవ్ తో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా ఇద్దరి జర్నీ ఒక్కటే. మా పెర్ఫార్మెన్స్ లతోనే ఇక్కడివరకూ వచ్చాం. సత్యకి, మాకు జీబ్రా మరో అద్భుతమైన సినిమా కాబోతోంది. నిర్మాతలకు థాంక్. చాలా పాషన్ తో సినిమాని నిర్మించారు. పుష్ప లో జాలిరెడ్డి తర్వాత జీబ్రాలో ఆదిగా వస్తున్నాను. మిస్ చేయకుండా చూడండి. తెలుగు నేర్చుకుని నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పాను. అందరికీ థాంక్’ అన్నారు.
యాక్టర్ సత్య రాజ్ మాట్లాడుతూ.. మోహన్ బాబు గారు నాకు మంచి స్నేహితులు. మనోజ్ ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. జీబ్రాలో చాలా పెక్యులర్ క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ నేను గతంలో చేసిన పాత్రలకు పూర్తి వైవిధ్యంగా వుంటుంది. సత్యదేవ్, డాలీ, మిగతా నటీనటులంతా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ అన్నారు.
డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. ఇలాంటి మంచి కంటెంట్ ని నమ్మి ప్రోడ్యుస్ చేసిన నిర్మాతలకు థాంక్. ఆడియన్స్ మంచి కంటెంట్ ని సపోర్ట్ చేస్తారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. మీ సపోర్ట్ కావాలి. మనోజ్ గారికి థాంక్ యూ. ఈ సినిమాలో పని చేసిన అందరూ మంచి హ్యుమన్ బీయింగ్స్’ అన్నారు.
హీరోయిన్ జెన్నిఫర్ పిసినాటో మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా వున్నాం. తప్పకుండా దిన్ని అందరూ ఎంజాయ్ చేశారు. ఇది నాకు లైఫ్ చేంజింగ్ ఎక్స్ పీరియన్స్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ’ అన్నారు.
నిర్మాత దినేష్ సుందరం మాట్లాడుతూ.. మనోజ్ గారికి థాంక్. జీబ్రా చాలా కొత్త కంటెంట్. వెరీ న్యూ ఎటెంప్ట్. ఈశ్వర్ కార్తికి చాలా అద్భుతంగా సినిమాని తీశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
నిర్మాత బాల సుందరం మాట్లాడుతూ..అందరికీ థాంక్ యూ. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ చాలా మంచి కన్విక్షన్ తో సినిమా చేశారు. సత్య దేవ్, డాలీ ధనంజయ తో పాటు అందరూ చాలా ఎఫెర్ట్ పెట్టారు. సినిమా అందరికీ పండగలా వుంటుందని భావిస్తున్నాం’ అన్నారు.
నిర్మాత ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మనోజ్ గారికి ధన్యవాదాలు. సత్యదేవ్, డాలీ ధనంజయ గారితో పాటు టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.
తారాగణం: సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
ఎడిషనల్ స్క్రీన్ ప్లే: యువ
నిర్మాతలు: SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్లు: పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి
డీవోపీ: సత్య పొన్మార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్: సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్