నేచురల్ స్టార్ నాని, సుజీత్, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Nani32 అనౌన్స్ మెంట్

వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నటిస్తున్నారు. నాని బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ను విడుదల చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్‌ను అందిస్తూ బ్యానర్‌లో #Nani32ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఓజి’ సినిమా చేస్తున్న సుజీత్ తన తదుపరి సినిమా కోసం నానితో జతకట్టనున్నారు. ‘సరిపోదా శనివారం’ షూటింగ్ పూర్తయిన తర్వాత ఇది ఫ్లోర్స్ పైకి వెళ్లనుంది. “ఇది సుజీత్ సినిమా.🔥 పవర్ తర్వాత… లవర్ వస్తాడు😉♥️ #Nani32” అని ట్వీట్ చేశారు నాని.

అద్భుతమైన యాక్షన్ రైడ్‌గా రూపొందించబడిన ఈ చిత్రం కాన్సెప్ట్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఒక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు, అతని ప్రపంచం తలక్రిందులుగా మారుతుంది. ఇది సినిమా బేసిక్ లైన్ స్టోరీ. ఇది యూనిక్, ఇంట్రస్టింగ్ గా వుంది.

#Nani32, 2025లో విడుదల అవుతుంది. ప్రాజెక్ట్ కు సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: నాని

సాంకేతిక విభాగం:
రచన,దర్శకత్వం: సుజీత్
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్
పీఆర్వో: వంశీ-శేఖర్