‘నారాయణ అండ్ కో’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌ తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘నారాయణ అండ్ కో’ టీం అందరికీ బెస్ట్ విషెస్. ట్రైలర్ ఎక్స్టార్డినరీ వుంది. చివరి పంచ్ చాలా బాగుంది. వైబ్ చాలా బావుంది. నేను ఫన్ సినిమాలు ఎక్కువ చేశాను కాబట్టి నాకు జడ్జిమెంట్ బావుందనిపించిది. ఆడియన్స్ కి కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. టైటిల్ రోల్ చేస్తున్న దేవి ప్రసాద్ గారు, ఆమనీ గారు, ఆర్తి, పూజా..టీం అందరికీ బెస్ట్ విషెస్. దర్శకుడు చిన్నాతో పాటు టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా మీద ప్యాషన్ తో తీశారు. కంటెంట్ చాలా బావుంది. సుధాకర్ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్ జర్నీ. తనకి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో మంచి టేకాఫ్ వచ్చింది. ‘నారాయణ అండ్ కో’ తో తనకి మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నారు. జూన్ 30న సినిమా విడుదలవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి’’ అని కోరారు.

హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ.. దర్శకుడు చిన్నా ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. చాలా మంచి ఫన్ ఎంటర్ టైనర్ అనిపించి మొదలుపెట్టాం. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన కాస్త ఆలస్యమైంది. ఆర్ధిక సమస్యలు వచ్చినప్పుడు నా వంతు ఉడుత సాయం చేశాను. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే నాకు కొడుకు పుట్టాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల వ్యవధిలో మా నాన్న గారు చనిపోయారు. మా నాన్న ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్. కథ చెప్పినపుడు, సీన్స్ చూపించినపుడు చాలా ఆనంద పడ్డారు, ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఆయన కోసం ఈ సినిమా హిట్ ఇవ్వాలి. నా జీవితంలో ప్రధాన వ్యక్తి నా భార్య హారిక. ఆమె సపోర్ట్ తోనే ఈ ప్రయాణం చేయగలుగుతున్నాను. మేము ఇద్దరం కలిసి సుఖ మీడియా బ్యానర్ పెట్టాం. మొదటి ప్రోడక్ట్ గా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. చిన్నా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. అన్నీ తానై నడిపించాడు. నలుగురు సంగీత దర్శకులు మంచి మ్యూజిక్ ఇచ్చారు. దేవి ప్రసాద్, ఆమనీ గారు, ఆర్తి, పూజా, సప్తగిరి… అందరూ కలసి చేసిన చక్కని ఎంటర్ టైనర్ ఇది. ‘నారాయణ అండ్ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అనిల్ రావిపూడి గారు రావడంతో ఈ ఈవెంట్ కి ఒక కళ వచ్చింది. మాది ఎంటర్ టైనర్ ఫిల్మ్. అలాంటి సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన అనిల్ గారు రావడం చాలా ఆనందంగా వుంది. ఆయనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం వుంది. ఇప్పటికే కొన్ని వంద కోట్ల సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు బాలయ్య గారితో తీస్తున్న ‘భగవంత్ కేసరి’ వెయ్యి కోట్లు దాటి దద్దరిల్లిపోవాలి. అలాగే ఈ వేడుకకి విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జూన్ 30న ‘నారాయణ అండ్ కో’ థియేటర్ లో చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి’’ అని కోరారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..నాకు తెలిసిన ఒక నిర్మాత ఈ సినిమా చూసి చాలా నచ్చింది, అవుట్ రేట్ కి కొనాలని అనుకుంటున్నానని నాతో అన్నారు. టీం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. వాళ్ళు లాభాలు చూడాలని దర్శక నిర్మాత చిన్నా ఒక బోల్డ్ నిర్ణయం తీసుకున్నాడు. ఒక నిర్మాతకు అంతలా నచ్చిందంటే సినిమాలో ఏ రేంజ్ వినోదం వుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. మ్యూజిక్ చాలా బావుంది. సుధాకర్ కి చాలా గొప్ప భవిష్యత్ వుండాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ’.. సుధాకర్ మంచి నటుడు, రైటర్, డ్యాన్సర్. తనలో చాలా ప్రతిభ వుంది. ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ రోజుల్లో సినిమా హిట్ కావాలంటే కొత్తదనం ఉండాలి. ‘నారాయణ అండ్ కో’లో ఆ కొత్తదనం కనిపిస్తుంది. ఈ శుక్రవారంతో సుధాకర్ ఎదురుచూస్తున్న బ్రేక్ వస్తుందనే నమ్మకం వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

పూజా కిరణ్ మాట్లాడుతూ.. ‘నారాయణ అండ్ కో’ మంచి ఫన్ ఎంటర్ టైనర్. చిన్నా గారు చాలా అద్భుతంగా తీశారు. ఆమనీ గారితో పని చేయడం ఆనందంగా వుంది. ఆర్తి లవ్లీ కో స్టార్. సుధాకర్ గారితో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కోసం అందరం ఇష్టంగా పని చేశాం. జూన్ 30న మీ అందరూ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అని కోరారు

ఆర్తి పొడి మాట్లాడుతూ.. ఇది నా మొదటి తెలుగు సినిమా. ఈ సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా మంచి టీంతో పని చేశాను. సుధాకర్ గారు చాలా ప్రతిభ గల నటుడు. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. బ్రదర్స్ అందరూ కలసి ఈ సినిమా నిర్మించడం ఆనందాన్ని ఇచ్చింది. దర్శకుడు చిన్నాకి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రోత్సహించడం పెద్ద బలం. తను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. సుధాకర్ కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. జూన్ 30న ఆ విజయం రావాలి అని కోరుకుంటున్నాను . టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

సప్తగిరి మాట్లాడుతూ.. చిన్న సినిమాలు వచ్చి పెద్ద విజయాలు సాధించిన ప్రేమకథా చిత్రమ్ లాంటి సినిమాలు ఈ మద్య కాలంలో రాలేదు. అలాంటి సంచలన విజయం సాధించే సత్తా ‘నారాయణ అండ్ కో’ చిత్రానికి వుంది. కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ చక్కగా కుదిరారు, సుధాకర్ కి నేను అభిమానిని. తన డ్యాన్స్ , నటన అంటే నాకు ఇష్టం. దర్శకుడు చిన్నా కి మంచి ప్రతిభ వుంది. ఆమని గారితో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఆడితే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్ లో చూసి ఆదరించాలి’’ అని కోరారు

తిరువీర్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ లోనే కొత్తదనం వుంది. ఈ కథ చాలా బావుంటుంది. సుధాకర్ నటిస్తూ నిర్మించడమే దానికి సాక్ష్యం. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. సినిమాలో పని చేసిన అందరికీ మంచి పేరు రావాలి. జూన్30న సినిమా వస్తోంది. అందరూ ఆదరించాలి’’ అన్నారు

దర్శక, నిర్మాత చిన్నా మాట్లాడుతూ.. బ్రదర్స్ కలసి సినిమా నిర్మించడం ఈ రోజుల్లో అరుదు. మా సేవింగ్స్ ఈ సినిమాలో పెట్టాం క్యాలిటీ కంటెంట్ ఇస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. ఈ ప్రయాణంలో చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇది ఫ్యామిలీ ఫండడ్ మూవీ. చాలా మంది సపోర్ట్ తో ఈ సినిమా ఫినిష్ చేశాం. సినిమా చాలా బావొచ్చింది. సుధాకర్ గారికి కృతజ్ఞతలు. సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు

ఆమని మాట్లాడుతూ.. ‘నారాయణ అండ్ కో’ చక్కని పాత్ర చేశాను. చాలా డిఫరెంట్ రోల్. ఇందులో కామెడీ చాలా స్పెషల్. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చిన్నా గారు చాలా ప్లానింగ్ తో తీశారు. సుధాకర్ గారికి నటన అంటే ప్యాషన్. నిర్మాత గా కూడా ఎక్కడా రాజీపడకుండా తీశారు. తను చాలా పెద్ద స్టార్ అవుతారు. చాలా మంచి సినిమా ఇది. మీ అందరికీ సపోర్ట్ కావాలి’’ అన్నారు.

దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నారాయణ అండ్ కో’ నాకు చాలా స్పెషల్ మూవీ. దర్శకుడిగా కొన్ని కామెడీ సినిమాలు చేశాను. కానీ నటుడిగా మారిన తర్వాత ఫుల్ లెంత్ కామెడీ రోల్ రాలేదు. ఇప్పుడు మొదటిసారి ‘నారాయణ అండ్ కో’ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ చేస్తున్నాను. దర్శకుడు చిన్నా గారికి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడ తడబడకుండా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. సుధాకర్ చాలా ప్రతిభ వున్న నటుడు. పెద్ద స్టార్ అవుతారు. టీం అందరూ చక్కగా చేశారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని కోరారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.