నాని ‘హాయ్ నాన్న’ సెకెండ్ సింగిల్ అక్టోబర్ 6న విడుదల

పాన్ ఇండియా మూవీ ‘హాయ్ నాన్నా’ మ్యూజికల్ గాల చార్ట్ బస్టర్ నెంబర్ సమయమాతో ప్రారంభమైయింది. ఈ పాట లీడ్ పెయిర్ -నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని చూపించింది. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ గాజు బొమ్మ అక్టోబర్ 6న విడుదల కానుంది.

నాని, కియారా ఖన్నా ముచ్చటగా మాట్లాడుకుంటున్న వీడియో ద్వారా ఇదే విషయాన్ని అనౌన్స్ చేశారు. ”లవ్ సాంగ్ రిలీజ్ చేశావ్.. మరి మన సాంగ్ ? అని బేబీ కియారా నానిని అడుగుతుంది. నాని పాపని గాజు బొమ్మ అని పిలుస్తాడు. తండ్రి కూతురు నేపధ్యంలోని ఈ పాట ‘హాయ్ నాన్నా’ సోల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

హాయ్ నాన్న తో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.

హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC డీవోపీగా, ప్రవీణ్ ఆంథోని ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

హాయ్ నాన్నా ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది

తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఈవీవీ సతీష్
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్