గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ రో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో వరంగల్ లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. దర్శకులు వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.
‘’నువ్వు యేడ వున్న గిట్ల దమ్ముతో నిలబడాలే అప్పుడే దునియా నీ బాంచన్ అంటది’’ అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. ట్రైలర్ లో తండ్రీ కూతుర్ల బాండింగ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. తెలంగాణ మాండలికంలో బాలయ్య డైలాగులు చెప్పడం అమితంగా ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని విధంగా స్టైలీష్ గా, పవర్ ఫుల్‌గా బాలకృష్ణ ని ప్రజెంట్ చేయడంలో అనిల్ రావిపూడి సూపర్ సక్సెస్ అయ్యారు. భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ ట్రాన్స్ ఫర్మేషన్ మార్వలెస్ గా వుంది. యాక్షన్ సీక్వెన్స్ లో సరికొత్తగా డైనమిక్ గా కనిపించారు బాలయ్య. శ్రీలీల, కాజల్ పాత్రలు చాలా స్ట్రాంగ్ గా వున్నాయి. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే అర్జున్ రామ్ పాల్ కూడా పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు. ట్రైలర్ లో తమన్ అందించిన నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో మాస్ ని ఎలివేట్ చేసింది. రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్ బ్రిలియంట్ గా వున్నాయి. షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి మ్యాసివ్ ట్రైలర్ తో ‘భగవంత్ కేసరి’ పై అంచనాలు పెంచేశాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..‘‘పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన వరంగల్ ప్రజలు, నా అభిమానులందరికీ కళాభినందనలు. దసరా నవరాత్రులకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆ భద్రకాళి అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించారనుకుంటున్నాను. సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మలాంటి ఎందరో పోరాట యోధులను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను. పెండ్యాల రాఘవయ్య వరంగల్ ఎంపీగా, హనుమకొండ ఎమ్మెల్మేగా, వర్దన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1984లో నాన్నగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు గుడివాడ, హిందూపూర్, నల్గొండ నుంచి పోటీ చేసి మూడు సీట్లు గెలవడం జరిగింది. అలాంటి మహానుభావులందరి స్మరించుకుంటున్నాను. నేను తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో మాట్లాడాను. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనమున్న సినిమాలు అందించాలనే తాపత్రయం నాన్న గారి నుంచి పారంపర్యంగా వస్తోంది. ‘అఖండ’ తర్వాత ఏం చేయాలనుకున్న తరుణంలో ‘వీరసింహారెడ్డి’లో చేశాను. అది అన్ని రికార్డులు సృష్టించడం జరిగింది. తర్వాత ఏంటని అనుకుంటున్న తరుణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి లాంటి సరైన సినిమా దొరికింది. బాలకృష్ణ సినిమా అంటే పంచభక్ష పరమాన్నాలు వున్న భోజనంలా అన్నీ వుండాలి.
ఇందులో కూడా అన్నీ వుంటాయి. టోటల్ గా డిఫరెంట్ సినిమా ఇది. ట్రైలర్‌లో మీరు చూసింది కొంతే. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అదంతా దాచి పెట్టాం. దసరాకి ముందు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం. దసరాకి ముందు దంచుదాం. కొత్త సినిమా చేసేముందు నేను నా పాత చిత్రాల గురించి చర్చించను. బాబీతో సినిమా చేయబోతున్నాను. ప్రతి సినిమాని సవాలుగా స్వీకరిస్తాను. చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు నేను చేయగలిగానంటే అది సమిష్టి కృషి, నా అదృష్టం, కళామతల్లి చల్లని దీవెనలుగా భావిస్తున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ప్రతిభావంతుడు. సెట్స్ లో జోకులు వేస్తూ నవ్విస్తూ ఉండేవాడు. ఈ సినిమా ఒక ప్రయాణం. ఒక వీరసింహా రెడ్డి, సింహా, లెజెండ్, అఖండ. శ్రీరామరాజ్యం. ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా నా సినిమాలన్నీ ఒక ప్రయాణం. ఈ వేడుకలో మాట్లాడిన చాలా మంది ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. పాత్రల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ పాత్రల్లో వున్నామంటే సినిమాలో ఆ పాత్రలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు ప్రత్యేక్షంగా చూస్తారు. కాజల్ వెర్సటైల్ నటి. ఇందులో చాలా చక్కని పాత్రని పోషించారు.
శ్రీలీల ఇందులో నన్ను చిచ్చా చిచ్చా అని పిలుస్తుంది తర్వాత సినిమాలో హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేద్దామని ఆమెతో చెప్పా. ఇదే మాటను నా భార్య, కొడుకుతో కూడా చెప్పా. ‘ఏంటి డాడీ.. నేను హీరోగా రాబోతుంటే నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తావా?( నవ్వుతూ) అన్నాడు. శ్రీలీల చాలా మంచి నటి. ఇందులో చేసిన పాత్ర ఆమె కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఇందులో అర్జున్ రాంపాల్ తో నటించడం గొప్ప అనుభూతి. మా ఇద్దరి కాంబినేషన్ అద్భుతంగా వుంటుంది. మిగతా నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. కెమరామెన్ తమ్ముడు ప్రసాద్ తో మాది చాలా మంచి ప్రయాణం. నా ప్రతి కదలికని ఒడిసిపట్టుకునే కెమరామెన్ తను. నా సినిమా అంటే తమన్ కి పూనకం వస్తుంది. బాక్సు బద్దలైపోయేలా కొడతాడు. అఖండ థియేటర్స్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు. కరోనా సమయంలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే మీమాంసలో చిత్ర పరిశ్రమ ఉన్న సమయంలో ‘అఖండ’ను విడుదల చేశాం. ప్రభుత్వాలు మాకేం సహకరించలేదు. అదనపు షోలు లేవు. టికెట్ రేట్లు పెంచలేదు. ప్రేక్షకులు తరలి వచ్చారు. రికార్డు సృష్టించిందా సినిమా. పారిశ్రామిక రంగాన్ని ఎలా గుర్తిస్తారో చిత్ర పరిశ్రమను ప్రభుత్వాలు అలాగే గుర్తించాలి. అప్పుడే ప్రభుత్వాలకు మంచి ఆదాయం వస్తుంది. ఇక మా ఎడిటర్ తమ్మిరాజు రాజు చాలా మంచి వర్క్ చేశారు. అలాగే డ్యాన్స్ మాస్టర్స్ , ఫైట్ మాస్టర్స్ ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా గురించి చాలా వుంది. ఇదొక చరిత్ర, ఎపిక్. వీరసింహా రెడ్డి సినిమా చూసినప్పుడు మగాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అది ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి కూడా అఖండ, వీరసింహారెడ్డి లా ఘన విజయం సాధిస్తుంది. ఈ సినిమా చూసి మగాళ్ళు సైతం కన్నీళ్ళు పెట్టుకొని బయటికి వస్తారు. అంత అద్భుతంగా మా దర్శకుడు అనిల్ రావిపూడిగారు ఈ సినిమాని తీర్చిదిద్దారు. మంచి పాటలు, ఫైట్లు, డైలాగులు, యాక్షన్ సీన్స్స్ తో సినిమా అంతా ఒక పండగలా వుంటుంది. నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు గారు చాలా శ్రద్ధతో అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇన్ని కోట్లమంది అభిమానులని పొందటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను సంపాదించింది అభిమానుల అభిమానమే. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ముందుగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు హరీష్, సాహు గారికి థాంక్స్. బడ్జెట్, మేకింగ్ పరంగా నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. దాని రిజల్ట్ అవుట్ పుట్ అక్టోబర్ 19న ప్రేక్షకులు చూస్తారు. భగవంత్ కేసరి సినిమా నా కెరీర్ లో శానా యేండ్లు యాదుంటుంది. నా రైటింగ్ టీం సాయి కృష్ణకి థాంక్స్. రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. తమ్మిరాజు గారికి థాంక్స్. బాలయ్య గారికి నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ చేసేపనిలో వున్నాడు తమన్. కాజల్ గారి పని చేయడం ఇదే తొలిసారి. చిన్న గ్యాప్ తర్వాత తెరపై కనిపిస్తున్న కూడా తను అద్భుతంగా కనిపిస్తున్నారు. ఇందులో చాలా మంచి పాత్ర చేశారు. అలాగే నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ గారు ఈ సినిమాతో తెలుగులో లాంచ్ కాబోతున్నారు. ఈ సినిమాకి ఆయన తెలుగు నేర్చుకొని డబ్బింగ్ కూడా చెప్పారు. శ్రీలీల చేసిన విజ్జి పాప రోల్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. విజ్జి పాప , భగవంత్ కేసరికి మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ వేడుకకి వచ్చిన వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ కి థాంక్స్. బాలయ్య బాబు గారు ఎన్నో గుర్తుండి పోయే పాత్రలు చేశారు. నటన ఆయనకు కొత్త కాదు. కానీ ఓ కొత్త పాత్ర ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ లా కష్టపడి పని చేసి, నేను పేపర్ మీద రాసిన దాని కంటే వెయ్యిరెట్లు అద్బుతంగా చేశారు. ప్రతి రోజు ఆయన నటన చూసి ఏం చెప్పాలో తెలీక మానిటర్ లో చూసి ఆనందించేవాడిని. ఈ రోజు ఒక హాగ్ ఇచ్చి ఆనందాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ వుంటాయి. భగవంత్ కేసరి పాత్రతో చాలా జర్నీ చేస్తారు. బాలకృష్ణ గారితో జర్నీ ఎప్పటికీ మెమరబుల్. బాలకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు’ తెలిపారు.
నిర్మాత సాహూ గారపాటి మాట్లాడుతూ.. ఈ వేడుకు ముఖ్య అతిధులుగా వచ్చిన వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ గారి ధన్యవాదాలు. ఈ సినిమాని అక్టోబర్ 19న విడుదల చేయడానికి మా టీం నుంచి చాలా సపోర్ట్ వుంది. మాకు అన్ని విధాలుగా తోడ్పడిన మా హీరో బాలకృష్ణ గారికి, దర్శకుడు అనిల్ రావిపూడిగారికి, మా టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాని బాలకృష్ణ గారి అభిమానులతో పాటు ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది మా ప్రామిస్. ఈ సినిమా మా బ్యానర్ లో బెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి , అనిల్ రావిపూడి గారి ధన్యవాదాలు. అక్టోబర్ 19న థియేటర్స్ లో కలుద్దాం.’’ అన్నారు
వంశీపైడిపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో దసరా కంటే పెద్ద పండగ లేదు. ఈ పండగ నిర్మాతలు సాహు, హరీష ఎంజాయ్ చేస్తారు. రామ్ ప్రసాద్ విజువల్స్ వండర్ ఫుల్ గా వున్నాయి. ట్రైలర్ అదిరిపోయింది. శ్రీలీల చాలా ముద్దుగా వుంది. బతుకమ్మ పండగని కాజల్, శ్రీలీల ఇంత ముద్దుగా ఆడుతుంటే చూడటానికి చాలా అనందంగా అనిపించింది. ట్రైలర్ లో శ్రీలీల పాత్ర చాలా కనెక్టింగ్ గా వుంది. ప్రతి తెలుగమ్మాయి శ్రీలీల పాత్రతో రిలేట్ అవుతుందనే నమ్మకం వుంది. కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. తన ప్రయాణం ఇంకా అద్భుతంగా కొనసాగుతుంది. బాలకృష్ణ గారి సినిమాల గురించి చెప్పడానికి నేను సరిపోను. నేను స్కూల్ లో చదువుతున్నప్పుడే బాలయ్యగారి సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి సిల్వర్ జూబ్లీలు ఆడాయి. ఇన్ని సినిమాల తర్వాత కూడ ఇదే తన తొలి సినిమా అన్నుట్లుగా ఒకొక్క సీన్ గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. బాలకృష్ణ గారు బసవతారకం హాస్పిటల్ ద్వారా చేస్తున్న సేవలు చిరస్మరణీయం. నందమూరి బాలకృష్ణ .. ఈ పేరు చాలా ఏళ్ళు గుర్తుకువుంటుంది. అనిల్ నాకు తమ్ముడు. నిజంగా తను సరస్వతి పుత్రుడు. అనిల్ ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ విజయాలే,ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి వుంటుంది. అన్నీ సినిమాలు మించి భగవంత్ కేసరి వుంటుంది. అక్టోబర్ 19 దసరా ఎలా వుంటుందో థియేటర్స్ లో చూపిద్దాం’’ అన్నారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. బాలయ్య బాబు అంటే రాజసం,, పూనకం, వ్యసనం.. బాలయ్య బాబు బంగారం. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఒక అభిమానిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. అక్టోబర్ 19న థియేటర్ దద్దరిల్లి పోవడం గ్యారెంటీ. బాలయ్య బాబు గారి దగర నుంచి ఫోన్ వస్తే ఒక పాజిటివ్ వైబ్ వుంటుంది. ఇందులో అందరి గురించి పేరుపెట్టి మరీ అడుగుతుంటారు. బాలయ్య బాబు మమ్మల్ని ఒంగోలియన్స్ అని పిలుస్తుంటారు. ఒక ఒంగోలియన్స్ వీరసింహారెడ్డి అయిపొయింది. ఇంకో ఒంగోలియన్ అనిల్ రావిపూడి భగవంత్ కేసరితో వస్తున్నారు. అనిల్ బాలకృష్ణ గారికి ఎంత అభిమానో తెలుసు. అనిల్ ఇప్పటివరకూ చేసిన సినిమా లు వేరు ఇది వేరు. ట్రైలర్ లో బాలయ్య బాబు చాలా కొత్తగా వున్నారు. ఇది ఫ్యామిలీస్ అంతా చూసే సినిమా అవుతుంది . అలాగే శ్రీలీల ఎక్స్ ట్రార్డినరీగా వుంది. కాజల్ గారు వర్సటైల్ యాక్టర్. తమన్ కి బాలయ్య బాబు అంటే పూనకం. ఇందులో ఆర్ఆర్ఆర్ మామూలుగా వుండదు. ట్రైలర్ ట్రాక్ వింటుంటే పూనకం వస్తుంది. సాహు, హరీష్ చాలా ప్యాషన్ వున్న నిర్మాతలు. సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .. జై బాలయ్య’’
బాబీ మాట్లాడుతూ.. ట్రైలర్ వార్ వన్ సైడ్ లా అద్భుతంగా వుంది. బాలకృష్ణ గారిని తొలిసారి పూరి జగన్నాథ్ గారి ఆఫీస్ లో కలిశాను. మూడు గంటలు పాటు ఆయనతో గడిపాను. బాలయ్య బాబు బంగారం. అలాంటి బాలయ్య బాబు గారితో అనిల్ తర్వాత సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా కూడా చాలా ఏళ్ళు గుర్తుంటుంది. అనిల్ రావిపూడి చాలా మంచి మనసున్నవ్యక్తి. ఈ సినిమా ఖచ్చితంగా తన కెరీర్ లో మెమరబుల్ సినిమాగా ఉంటుందని నమ్ముతున్నాను. నిర్మాతలు సాహు గారు, హరీష్ గారు చాలా పెద్ద సినిమాతో రాబోతున్నారు. కాజల్, శ్రీలీల అద్భుతంగా కనిపిస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 19.. భగవంత్ కేసరి. కెసిపిడి’’ అన్నారు.
శ్రీలీల మాట్లాడుతూ.. ఈ వేడుక వరంగల్ లో జరగడం చాలా ఆనందంగా వుంది. ఇందులో నేను వరంగల్ అమ్మాయిగా కనిపిస్తాను. భగవంత్ కేసరి బ్యూటీఫుల్ స్టొరీ. అందుకే ఇవాళ శ్రీలీల లా రాలేదు ఇందులో పాత్ర అయిన విజ్జి పాపలా వచ్చాను. విజ్జి పాప అనే పేరు పెట్టిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. సోల్ కనెక్ట్ వున్న అందమైన పాత్ర ఇచ్చిన అనిల్ రావిపూడిగారికి చాలా చాలా థాంక్స్. ఈ పాత్ర చేయడం నా అదృష్టం. బాలకృష్ణ గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇందులో చాలా అందమైన సీన్స్ వున్నాయి. కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్ లో కంటిన్యూ అయిపోయేదాన్ని. అప్పుడు బాలకృష్ణ గారు సరదాగా జోకులు వేసి నవ్వించేవారు. నా జీవితంలో లేని అనుభవాల్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారిది గొప్ప మనసు. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టం. మా నిర్మాతలకు థాంక్స్. అక్టోబర్ 19న సినిమా వస్తుంది. తప్పకుండా అందరూ చూడాలి’’ అని కోరారు
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. బాలయ్య గారు గ్రేట్ లెజెండ్. ఆయనతో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. అలాగే అనిల్ రావిపూడి గారితో వర్క్ చేయడం ఆనందంగా వుంది. అనిల్ ట్రూ ఫైర్ హౌస్. సాహు , హర్ష గారి థాంక్స్ . శ్రీలీల చాలా ట్యాలెంటెడ్ . వండర్ ఫుల్ పర్శన్ . సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అభిమానులకు కృతజ్ఞతలు’’ తెలిపారు. ఈ వేడుకలో మురళీధర్, రచ్చ రవి, జాన్ విజయ్, కాసర్ల శ్యామ్.. మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.