బాగా వైరల్ అవుతున్న నమ్రత పోస్ట్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయంకృషితో సూపర్ స్టార్ గా ఎదిగి, ఉన్నత శిఖరాలు అధిరోహించిన లెజెండ్ ఘట్టమనేని కృష్ణ గారి మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులే కాదు.. వీరాభిమానులు, తెలుగు ప్రేక్షకులు అప్పుడే మర్చిపోలేకపోతున్నారు. అభిమానులైతే ఎంతగా అంటే.. ఇంకా ఆయన జ్ఞాపకాల్లోనే తేలియాడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో మహేష్ బాబు, సుధీర్ బాబు, కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరి రావు బాగా ఎమోషనల్ అవడంతో అభిమానులు కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు కానీ.. కృష్ణ గారి కర్మ రోజున వదిన మృదుల, అన్నయ్య పిల్లలు భారతి, జయకృష్ణలతో మహేష్ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించినప్పుడే అందరికీ తెలిసింది. అంతేకాదు.. మహేష్ భార్య నమ్రత తాజాగా బావ గారి కుమార్తె భారతి గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ”ఈ ఇద్దరమ్మాయిల వల్ల ఇంట్లో నవ్వులొచ్చాయి” అంటూ భారతి.

సితారలతో కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు నమ్రత. బావ రమేష్ బాబు కూతురి గురించి మహేష్ వైఫ్ ఫస్ట్ టైం పోస్ట్ చేయడంతో ఈ ఫొటో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ‘ సితార, భారతి ఇద్దరూ మహాలక్ష్మీలా ముచ్చటగా ఉన్నారు’ అంటూ మహేష్ ఫ్యాన్స్, నెటిజన్లు ఎవరికీ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు పోస్టులు పెడుతూ కామెంట్స్ చేస్తూ కృష్ణపై వాళ్లకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు