నాగ శౌర్య ‘రంగబలి’ ఫస్ట్ సింగిల్- మన ఊరిలో ఎవడ్రా ఆపేది విడుదల

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రంగబలి’లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో యూనిక్ చిత్రాలను రూపొందించడంలో మంచి అభిరుచి ఉన్న ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్యకి జోడిగా యుక్తి తరేజ నటిస్తోంది.

పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మన ఊరిలో ఎవడ్రా అపేది పాట విడుదలైయింది. నాగ శౌర్య అత్యంత ఎనర్జిటిక్ బీట్‌లతో ఈ పెప్పీ నంబర్‌తో మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ పాట లోకల్ లో ఉండడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటని డైనమిక్‌గా పాడాడు. నాగశౌర్య తన మాస్ డ్యాన్స్‌లతో పాటలో గ్రేస్ చూపించాడు. జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. పవన్ బాసంశెట్టి, శ్రీ హర్ష ఈమని కలిసి సాహిత్యం అందించారు.

ఈ సినిమాలో నాగ శౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తున్నారు.

దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సిహెచ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటర్, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది.

నటీనటులు: నాగ శౌర్య, యుక్తి తరేజ

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్
సంగీతం: పవన్ సిహెచ్
డీవోపీ: దివాకర్ మణి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్