నాగ చైతన్య ‘కస్టడీ’ పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. ‘కస్టడీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇటివలే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ ని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 12, 2023న విడుదలవుతోంది. గ్రాండ్ గా న్యూ ఇయర్ 2023కి స్వాగతం పలుకుతూ.. ఈరోజు మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి గ్లింప్స్ లో ప్రేక్షకులను, నాగ చైతన్య అభిమానులను ఎక్సయిట్ చేసే అన్ని అంశాలు ఉన్నాయి. గ్రిప్పింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఏరియల్ షాట్‌ లతో టీజర్ ప్రారంభమవుతుంది. ట్రైన్ దూసుకురావడం, రివర్స్డ్ కార్లు పేలడం, నాగ చైతన్య విలన్స్ కు పవర్ ఫుల్ పంచ్‌ లు, కిక్‌ లు ఇస్తూ యాక్షన్‌ లోకి దిగడం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.

నాగ చైతన్య మాసియస్ట్ అవతార్‌ లో కనిపించారు. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు గ్లింప్స్ చివర్లో నాగచైతన్య ఫెరోషియస్ లుక్ క్యూరియాసిటీని పెంచింది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండింగా వుంది.

వెంకట్ ప్రభు మరోసారి తన సాంకేతిక నైపుణ్యాన్ని చూపించారు. వీడియో ఆడ్రినలిన్ రష్ ఇస్తుంది. వెంకట్ ప్రభు తన చిత్రానికి ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్‌ ఇవ్వడంలో కూడా దిట్ట. కస్టడీ ట్యాగ్‌లైన్ ‘ఎ వెంకట్ ప్రభు హంట్.’

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, అద్భుతమైన సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ని పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు

సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్స్: అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
యాక్షన్: మహేష్ మాథ్యూ
ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట