నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ నుంచి సీసా మూత ఇప్పు పాట విడుదల

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. పోస్టర్‌లు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘సీసా మూత ఇప్పు’ పాటని విడుదల చేశారు. కీరవాణి ఈ పాటని పుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. ఆస్కార్ లిరిసిస్ట్ చంద్రబోస్ అందించిన లిరిక్స్ మాస్ ని అలరించేలా వున్నాయి.

మల్లికార్జున్, రేవంత్, సాయిచరణ్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండియా కలసి ఈ పాటని చాలా హుషారుగా ఆలపించారు. ఈ పాటలో నాగార్జున డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ని కట్టి పడేస్తున్నాయి. నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలసి డ్యాన్స్ చేయడం ప్రేక్షకులకు కన్నుల పండగలా వుంది. ఈ పాటకు థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం.

మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన ‘నా సామిరంగ’ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ.

ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.

నా సామిరంగ జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది.

తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: శివేంద్ర దాశరధి
సమర్పణ: పవన్ కుమార్
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సాహిత్యం: చంద్రబోస్
పీఆర్వో: వంశీ-శేఖర్