ఓటీటీలో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ షూటింగ్ ప్రారంభం

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5. ఇప్పుడు స‌రికొత్త యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్‌తో ఆక‌ట్టుకోవ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించ‌బోయే న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్ రెగ్యుల‌ర్ షూటింగ్ శ‌నివారం నుంచి ప్రారంభ‌మైంది.

8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ‌ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించని స‌రికొత్త లొకేష‌న్స్‌లో ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు.

జీ5 గురించి:

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంక్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక, వ్య‌వ‌స్థ‌ వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన మ‌నోజ్ బాజ్‌పాయి న‌టించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రం కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటోంది.

న‌టీన‌టులు: సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్‌: ఫిల్మ్ రిప‌బ్లిక్‌, నిర్మాత‌: ప్ర‌ణ‌తి రెడ్డి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ స‌త్తారు, సినిమాటోగ్ర‌ఫీ: న‌రేష్ రామ‌దురై, ఆర్ట్: సాయి సురేష్‌, ఎడిట‌ర్‌: ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, పి.ఆర్‌.ఓ: ఫణి – నాయుడు (బియాండ్ మీడియా), డిజిట‌ల్: టికెల్ ఫ్యాక్ట‌రీ.