తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్స్‌లో విడుదలైంది. సక్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి ఆదరణను దక్కించుకుంటుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం సినిమా ఆకట్టుకుంటోంది.
మనందరి జీవితాల్లో జరిగిన , మనం చూసిన ఘటనలను ఆధారంగా చేసుకుని మనిషికి బందాలే గొప్ప బలం.. బలగం అనే చాటి చెప్పేలా సినిమాను రూపొందించారు. ఈ సినిమాను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ సోమవారం ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం..
బలగం టీమ్‌ను అప్రిషియేట్ చేస్తూ మీడియాతో మాట్లాడుతూ … ‘‘సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించటమే కాకుండా పలు టీవీ షోస్‌లో నటించి ఆకట్టుకున్న వేణు ఎల్దండిగారు ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారారు. దిల్ రాజుగారు ఎప్పుడూ మంచి చిత్రాలను అందించాలని ఆలోచిస్తుంటారు. ఆయన వారసులైన హర్షిత్, హన్షితలు ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించాలనే సంకల్పంతో ‘బలగం’ అనే చిత్రాన్ని నిర్మించారు. గ్రామీణ వాతావరణంలో రియాలిటీగా తరతరాలుగా జరిగే ఓ పాయింట్‌ను తీసుకుని దాన్ని కథగా మార్చారు. దాంట్లో ప్రియదర్శిగారు, కావ్యా కళ్యాణ్ రామ్‌గారు ప్రధానమైన పాత్రలను పోషించారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, రైటర్ కాసర్ల శ్యామ్ వారి వారి పాత్రలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఒక కొమరయ్య అనే పాత్రను బేస్ చేసుకుని ‘బలగం’ కథను తయారు చేశారు.
ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమాలో గ్రామస్థుల మన సంస్కృతులను ఇప్పటికీ పాటిస్తున్నారు. నిజంగా గ్రామాల్లో ఏం జరుగుతాయనే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. నిర్మాతగా దిల్‌రాజుగారి టేస్ట్ ఏంటో మనకు తెలుసు. ఆయన నిర్మాతగా ఎన్నో గొప్ప, అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ‘బలగం’ సినిమాతో దిల్ రాజు వారసులుగా హర్షిత్, హన్షితగారు ఓ దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఇందులో ఆర్టిస్టులు కూడా సహజ సిద్ధంగా నటించారు.
సినిమా బావుంటే చిన్నదా, పెద్దదా అని తేడా లేకుండా అద్భుతమైన ఫలితం వస్తుందనే దానికి ఈ బలగం సినిమా ఓ ఉదాహరణ. ఈ సినిమా కోసం టీం ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఈ సినిమాను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ‘బలగం’. నేను సినిమా చూసినప్పుడు మన అసలైన సంస్కృతి, సాంప్రదాయాలేంటనేది బలగం సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇలాంటి సినిమాను ఆదరించాలి. అందరూ యంగస్టర్స్ కలిసి చేసిన గొప్ప ప్రయత్నం .
‘బలగం’ సినిమాను నిర్మించిన వాళ్లు, మీడియా వాళ్లే కాకుండా మా వంతుగా సపోర్ట్ చేయాలనిపించింది. అందుకోసం నేనే దిల్ రాజుగారికి ఫోన్ చేసి సినిమాను చూస్తానని చెప్పాను. రియాలిటీకి దగ్గరైన చిత్రమని చూడగానే అర్థమైంది. పాత్రల్లోని ఎమోషన్స్ అన్నింటినీ చక్కగా చూపించారు. కాకి అనే పక్షికి మన సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైనా చనిపోతే మనం పెట్టే వంటకాలను కాకి ముట్టుకోవాలని అందరూ భావిస్తారు. అలాంటి అంశాలన్నింటినీ సినిమాలో చక్కగా చూపించారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని దిల్ రాజు ముందుకు వచ్చారు. గ్రామీణ ప్రాంతంలో జరిగే ఈ కథ ఆయనకు ఎంతగానో నచ్చింది. వేణు ఎల్దండి తొలిసారి డైరెక్టర్ అయినప్పటికీ దిల్ రాజు ప్రొడక్షన్ అవకాశం ఇవ్వటం నిజంగా అభినందించాల్సిన విషయం.శంకరాభరణం సినిమా కూడా రిలీజైనప్పుడు వెంటనే ఆదరణ లభించలేదు. రాను రాను సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 365 రోజులు ఆడింది.
ప్రేక్షకులు సినిమా అంత బాగా నచ్చింది. అలాగే బలగం సినిమాను నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని చేశారు. కుటుంబ సమేతంగా అందరూ చూడాల్సిన చిత్రం. ఇంత మంచి సినిమా తీసిన దిల్ రాజుగారికి, హర్షిత్, హన్షిత, నటీనటులు, సాంకేతిక నిపుణులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అన్నారు.