దిల్ రాజు ప్రొడక్షన్స్ తాజా సినిమా ‘ఆకాశందాటి వస్తావా’ నుంచి మెలోడీ ‘శృంగార…’ రిలీజ్

‘బలగం’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న లేటెస్ట్ సినిమా ‘ఆకాశం దాటి వస్తావా’. దీంతో యంగ్ కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్నారు. CIA (కామ్రేడ్ ఇన్ అమెరికా) ఫేమ్, మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులను పరిచయం చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు ‘ఆకాశం దాటి వస్తావా’తో శశి కుమార్ ముతులూరిని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ దర్శకుడిగా పరిచయం చేస్తోంది. ఇదొక మ్యూజికల్ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరి. రీసెంట్‌గా ఫస్ట్ సాంగ్ ‘ఉన్నానో లేనో…’ రిలీజ్ చేశారు. అంతకు ముందు విడుదల చేసిన ఆ సాంగ్, సినిమా టీజర్ ప్రేక్షకులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈరోజు సినిమాలో సెకండ్ సింగిల్, రొమాంటిక్ మెలోడీగా రూపొందించిన ‘శృంగార…’ పాటను విడుదల చేశారు

శృంగార పాటను సంజిత్ హెగ్డే, మాళవికా శంకర్ ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ తన అద్బుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. దర్శకుడు శశి కుమార్ ముతులూరి ఈ సాంగ్ రాయడం విశేషం. ఇందులో హీరో హీరోయిన్లు యష్, కార్తీక మురళీధరన్ మధ్య కెమిస్ట్రీ అందంగా ఉంది. ప్రేమ జంట మధ్య ఎటువంటి అవధులు లేని స్వచ్ఛమైన రొమాన్స్ ఈ పాటలో చూపించారని చెప్పాలి. మొదట వాళ్లిద్దరిని చూపించి… ఆ తరువాత నెమ్మదిగా వాళ్ళ రొమాంటిక్ ప్రపంచంలోకి తీసుకువెళ్లారు దర్శకుడు. ప్రేక్షకులకు ఈ పాట చక్కటి కనువిందు అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బలగం తర్వాత వాళ్ళిద్దరూ నిర్మిస్తున్న చిత్రమిది.

నటీనటులు: యశ్వంత్ మాస్టర్, కార్తీక మురళీధరన్ తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి
రచన, దర్శకత్వం: శశి కుమార్ ముతులూరి
మ్యూజిక్ డైరెక్టర్: కార్తీక్

Srungara - Video Song | Aakasam Dhaati Vasthaava | Yashwant, Karthika M | Sasi Kumar M | Karthik