Mass Jathara Trailer: మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జతర’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది.

రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం ‘మాస్ జతర’ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా ‘మాస్ జతర’ ట్రైలర్ ఉంది. నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు.

ట్రైలర్ కు మరింత ఆకర్షణ మరియు తాజాదనాన్ని జోడిస్తూ, కథానాయిక శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు. ఆమె మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడినప్పటికీ, ఆ యాసను పూర్తిగా ఆస్వాదిస్తూ అద్భుతంగా పలికిన తీరు ఆశ్చర్యపరిచింది. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

Mass Jathara - TRAILER | Ravi Teja, Sreeleela | Bhanu Bhogavarapu | Bheems Ceciroleo | S Naga Vamsi

ఇప్పటికే పాటలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ వింటేజ్ మాస్ ఆరాకు సరిగ్గా సరిపోయేలా ఆయన సంగీతం ఉంది. భారీ పోరాట సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అద్భుతమైన పాటలతో విందు భోజనం లాంటి చిత్రానికి ‘మాస్ జాతర’ హామీ ఇస్తోంది.

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ‘మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మాస్ జాతర

తారాగణం: రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర

దర్శకత్వం: భాను భోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

AP State Food Commission Chairman Vijay Prathap Reddy Inspection Govt Schools | Telugu Rajyam