‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమిర్ జంటగా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ (X) ద్వారా ‘మంగళవారం’ ట్రైలర్ విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ఆయన విడుదల చేయగా… ఆఫ్‌లైన్‌లో హీరో కార్తికేయ విడుదల చేశారు.
చిరంజీవి ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ ”ఈ సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి ఎంతో డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజకి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీలో వివిధ శాఖల్లోకి ఎంటర్ అవుతుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కొత్త ఆలోచనలు, న్యూ ఎనర్జీ తో ఫిలిం మేకింగ్, మార్కెటింగ్ లకి ఒక కొత్త డైరెక్షన్ ని ఇవ్వగలరు. అందుకని స్వాతి రెడ్డి లాంటి యంగ్ స్టర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అజయ్ భూపతి లాంటి ఓ టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయటం ఎంతో సంతోషం. విలేజ్ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్!” అని ట్వీట్ చేశారు.
యువ కథానాయకుడు, అజయ్ భూపతి తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ మాట్లాడుతూ ”ఆర్ఎక్స్ 100′ విడుదలై ఐదేళ్లు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆ సినిమా సక్సెస్ మీట్‌లో ఉన్నట్టు ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత నుంచి నేను, అజయ్ భూపతి లేదా నేను, పాయల్ ఎప్పుడు చేస్తామని అందరూ అడుగుతుంటే మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చా. వాళ్ళిద్దరికీ నేను ఫేవరెట్ అన్నట్లు ఉంటారు. ఒక రోజు వాళ్ళిద్దరూ సినిమా చేస్తున్నట్లు న్యూస్ చూశా. సర్లే ఏం చేస్తాం! మంచితనానికి రోజులు కావు ఇవి. నన్ను వదిలేసి సినిమా చేశారు. ‘ఆర్ఎక్స్ 100’ షూటింగ్ 50 రోజుల్లో కంప్లీట్ చేశాం. అజయ్ భూపతి 100 రోజులు షూటింగ్ చేస్తే ఎంత పెద్ద సినిమా తీస్తాడో నాకు తెలుసు. వాళ్ళ సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్ఎక్స్ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ఈ సినిమాలో చూపించాడు. గోదావరి అంటే వంశీ గారి సినిమాల్లో ఉన్నట్టు ఉంటుందని అనుకుంటాం. ‘ఆర్ఎక్స్ 100’తో కొత్త జానర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడీ సినిమా. 100 పర్సెంట్ అందరి కంటే ఈ సినిమా కంటే ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నా. అజనీష్ సంగీతం అద్భుతంగా ఉందని ట్రయిలర్ చూస్తే అర్థం అవుతోంది” అని అన్నారు.
తనతో కాకుండా పాయల్, అజయ్ భూపతి ముందు సినిమా చేశారని కార్తికేయ చెప్పగా… ”నీతో తీయనని అనుకున్నావా? కార్తికేయతో ముందు రిపీట్ చేయాలి. మైండ్ చెప్పడంతో అలా వెళ్లి ‘మంగళవారం’ చేశా. అతి త్వరలో, 100 పర్సెంట్ మా కాంబినేషన్ (కార్తికేయ)తో సినిమా ఉంటుంది. అది మామూలుగా ఉండదు. ప్లానులో ఉంది. షాక్ అయ్యే స్టోరీ ఉంది” అని అజయ్ భూపతి చెప్పారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ ”KCW కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా నేను పరిచయం అయ్యా. ఆ సినిమాకు కార్తికేయ హీరో. ఆయనే ప్రొడ్యూసర్. ఇప్పుడు నేను ACW (అజయ్ భూపతి క్రియేటివ్ వర్క్స్) సంస్థను ప్రారంభించా. భవిష్యత్తులో KCW, ACW కలుస్తాయేమో చూడాలి. సంగీత దర్శకుడు అజనీష్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అందుకని, ఇక్కడికి రాలేకపోయాడు. మా సినిమాటోగ్రాఫర్ శివేంద్రకు ‘మంగళవారం’ టీజర్ విడుదల తర్వాత నాగార్జున గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. బిజీ అయిపోయాడు. వాళ్ళిద్దరితో పాటు మిగతా టెక్నీషియన్లు అందరికీ థాంక్స్. డార్క్ థ్రిల్లర్ ఇది. డిఫరెంట్ జానర్ సినిమా తీశా. అంతకు మించి ఏమీ చెప్పలేను. అందులోనూ ఈ తరహా విలేజ్ & నేటివిటీతో కూడిన డార్క్ థ్రిల్లర్ తీయడం ఇంకా కష్టం. షూటింగ్ చేసేటప్పుడు ఎడిటింగ్, సౌండ్ మనసులో ఉండాలి.
ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని షూటింగ్ చేయాలి. ఎవరూ టచ్ చేయని పాయింట్ టచ్ చేశా. ‘ఆర్ఎక్స్ 100’ని ఆదరించినట్టు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. ‘మంగళవారం’ టైటిల్ వెనుక కారణం ఉంది. అది సినిమా చూస్తే తెలుస్తుంది. దేవతలకు ఇష్టమైన రోజు మంగళవారం. దానిని జయవారం అని కూడా అంటారు. ఎవరో కొందరు పిచ్చ పిచ్చ సామెతలు చెబుతారు. వాటిని పట్టించుకోవద్దు. మా నిర్మాతల గురించి చెప్పాలి. స్వాతి గారు చాలా క్లాస్. ఆవిడ ఇటువంటి రా అండ్ రస్టిక్, మాస్ సినిమా ఒప్పుకొన్నప్పుడు నా సినిమా సక్సెస్. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అని అనను. మహిళలకు సంబంధించిన పాయింట్ టచ్ చేశాం. అది నచ్చి ఆవిడ సినిమా చేస్తానని చెప్పారు. షూటింగ్ అంతా అవుటాఫ్ హైదరాబాద్ చేశా. బడ్జెట్ పెరిగింది. అయినా ఆవిడ పెద్ద సినిమా చేస్తున్నామని ఎంకరేజ్ చేశారు. మా అన్నయ్య సురేష్ వర్మ గారు, స్వాతి రెడ్డి గారికి థాంక్స్” అని అన్నారు.
స్వాతి రెడ్డి మాట్లాడుతూ ”నేను ‘మా టీవీ’లో పని చేశా. అప్పటి నుంచి మూవీ ప్రొడ్యూస్ చేయాలనేది డ్రీమ్. అప్పుడు సురేష్ గారు నా బాస్. ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాను. అజయ్ భూపతి గారి కథతో ముద్ర మీడియా వర్క్స్ మీద ఫస్ట్ మూవీ తీయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు కథ ఎలా చెప్పారో… కలిసిన ప్రతిసారీ అది పెరిగింది తప్ప తగ్గలేదు. ఆయనపై నమ్మకం పెట్టి సినిమా చేశాం. సినిమాలో ఆర్టిస్టులు అందరూ బాగా నటించారు. సురేష్ గారు లేకుండా మూవీ చేసేదాన్ని కాదు. అజనీష్ పాటలు, నేపథ్య సంగీతం లేకుండా సినిమా లేదు” అని అన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్ గురించి స్వాతి మాట్లాడుతూ ”నాన్నకు, నాకు సినిమాలు ఫేవరెట్. ఫ్రీ టైమ్ వచ్చినప్పుడు సినిమా చూడాలనేది హ్యాబిట్ నాన్న నుంచి అలవాటైంది. మూవీ బాలేదని ఆయన చెప్పడం ఎప్పుడు చూడలేదు. దర్శకుడు ఏమనుకున్నాడు? సినిమా వెనుక ఏం జరిగి ఉంటుందని మాట్లాడుకునేవాళ్ళం. సినిమాలపై నాలో క్యూరియాసిటీ ఉంది. ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని ఉండేది. మాటీవీలో జాబ్ చేసినప్పుడు ఎంజాయ్ చేశా. సురేష్ వర్మ గారితో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు అజయ్ భూపతి కలిశారు. నాన్నకు చెబితే ఎంకరేజ్ చేశారు. కథ చెప్పేటప్పుడు ఆయన కొన్ని సీన్లు యాక్ట్ చేసి చూపించారు” అని చెప్పారు.
నిర్మాత సురేష్ వర్మ ”మెగాస్టార్ చిరంజీవి గారు ట్విట్టర్ ద్వారా ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయనకు థాంక్స్. మెగాస్టార్ ఎక్కడ ఉన్నా బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని ఆశిస్తున్నా. చిరంజీవి గారి అభిమాని కార్తికేయ ఇక్కడికి వచ్చి ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. స్వాతిని నా సిస్టర్ గా చూస్తాను. అజయ్ నాకు నిజంగా బ్రదర్. మా కజిన్. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి ఈ కథ చెప్పాడు. స్క్రీన్ మీదకు వస్తే చూడాలని ఎగ్జైట్ అయ్యా. అప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకోలేదు. స్వాతి, నేను కలిసి వర్క్ చేసినప్పుడు భవిషత్తులో మంచి సినిమా చేయాలని డ్రీం ఉండేది. ఈ సినిమాతో నిర్మాతలుగా పరిచయం కావడం గర్వకారణంగా ఉంది. వేసవిలో షూటింగ్ చేసిన ఆర్టిస్టులు అందరికీ థాంక్స్. అలాగే, టెక్నీషియన్లు అందరికీ థాంక్స్” అని అన్నారు.
పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ ”నా జీవితంలో ముఖ్యమైన రోజు ఇది. ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ‘మంగళవారం’ సినిమా వచ్చింది. నన్ను ‘ఆర్ఎక్స్ 100’తో నన్ను అజయ్ భూపతి లాంచ్ చేశారు. అది నా కెరీర్ మార్చింది. ఇప్పుడు ‘మంగళవారం’లో అవకాశం ఇచ్చారు. మరోసారి ఆయన నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థాంక్స్” అని అన్నారు.
అజ్మల్ అమీర్ మాట్లాడుతూ ”అజయ్ భూపతి గారు ఫోన్ చేసినప్పుడు ‘రంగం’, ‘రచ్చ’ చూశానని చెప్పారు. డిఫరెంట్ అజ్మల్ కావాలని అడిగారు. స్క్రిప్ట్ చెప్పమని అడిగా. మీలో విలనిజం చూశానని, రొమాన్స్ చూపిస్తానని చెప్పారు. కథ నచ్చింది. హీరోయిన్ ఎవరని అడిగా. పాయల్ అని చెప్పారు. ‘ఆర్ఎక్స్ 100’ చూశా. ఆ సినిమా, సాంగ్స్ నచ్చాయి. షూటింగ్ చేసేటప్పుడు పాయల్ నల్లగా ఉన్నారు. అదేమిటని అడిగా. ఆవిడ చాలా కొత్తగా చేశారు. ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. ఇండియన్ స్క్రీన్ మీద అజయ్ భూపతి కొత్త పాయింట్ చెబుతున్నారు” అని అన్నారు.
నటుడు రవీందర్ విజయ్ మాట్లాడుతూ ”సినిమా గురించి ట్రైలర్ మాట్లాడింది. క్వాలిటీ ఆఫ్ యాక్షన్, విజువల్స్ కనిపించాయి. అజయ్ భూపతిలో గోదావరి యాటిట్యూడ్, ఎటకారం ఉన్నాయి. ట్రైలర్ లో ప్రేక్షకులు ఒక వైపు మాత్రమే చూశారు. మరో వైపు సినిమాలో చూస్తారు. అదిరిపోతుంది. నవంబర్ 17వ తేదీ కోసం ఎదురు చూస్తున్నా” అని చెప్పారు.
నందిత శ్వేతా మాట్లాడుతూ ”అజయ్ భూపతి గారు తీసిన కల్ట్, రస్టిక్, రా ఫిల్మ్ ‘మంగళవారం’. అజయ్ గారి మొదటి సినిమాకి అడిగినప్పుడు చేయలేకపోయా. అది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ పిలిచారు. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నా క్యారెక్టర్, కథ, ఎవరెవరు ఉన్నారని అడగలేదు. వెంటనే ఓకే చెప్పేశా. ఈ సినిమాలో వెరీ రా క్యారెక్టర్ చేశా. ఈ సినిమా చేశాక నాకు తెలుగు బాగా వచ్చింది. ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది” అని అన్నారు.
చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ ”మంగళవారం పేరులో మంగళకరమైన సూచన ఉంది. అజయ్ భూపతికి పాటలు రాయడం నాకు ఇష్టం. అతను విజువలైజేషన్ బావుంటుంది. ‘ఆర్ఎక్స్ 100’లో ‘పిల్లా రా..’ మొదలైంది నుంచి మా కాంబినేషన్ మొదలైంది. అటువంటి సెన్సేషన్ ‘ఏమైందో ఏమిటో..’ పాట కూడా క్రియేట్ చేస్తుందని నేను నమ్ముతున్నా” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గేయ రచయిత గణేష్, కొరియోగ్రాఫర్ భాను, ఆర్టిస్టులు గిరిధర్, ప్రభు, రామరాజు, దయ, శ్రీతేజ్, లక్ష్మణ్, శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మంగళవారం’ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది.
పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి, ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ రాజా కృష్ణన్, కొరియోగ్రఫీ : భాను, కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, పీఆర్వో : పులగం చిన్నారాయణ, డిజిటల్ మార్కెటింగ్ : టాక్ స్కూప్, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అజయ్ భూపతి.