తుపాను విజృంభణలా ‘ఆహా’లో ‘మా ఊరి పొలిమేర 2’ సెన్సేషనల్ హిట్

డిసెంబర్ 12, హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. డిసెంబర్ 8న ఆహాలో రిలీజైన ‘మా ఊరి పొలిమేర 2’ తుపాను విజృంభణలా దూసుకెళ్తోంది. రికార్డ్ టైమింగ్‌లో ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించటం విశేషం. విడుదలైన రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోన్న ఈ చిత్రం డిజిటల్ రంగంలో తిరుగులేని మార్క్‌ను క్రియేట్ చేసింది.

‘మా ఊరి పొలిమేర 2’ను గేమ్ చేంజర్‌గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించటమే కాదు,ఆహాకు న్యూ సబ్ స్క్రిప్షన్స్‌ను ఉప్పెనలా తీసుకు వచ్చింది.

సత్యం రాజేష్ నటుడిగా తన అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో మెప్పించారు. డైరెక్టర్ అనీల్ విశ్వనాథ్ చక్కటి, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయటంతో సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ఇది వరకు చూడని వైవిధ్యమైన కథాంశం, దాన్ని సినిమా రూపంలో మలచిన తీరు అందరినీ మెప్పిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ఆహాలో సరికొత్త సంచనాలను నాంది పలుకుతోంది.

* హృదయాన్ని హత్తుకునే ‘మా ఊరి పొలిమేర 2’ సినిమాను ‘ఆహా’లో వీక్షించే అవకాశాన్ని వదులుకోకండి.