శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో `మా ఊరి పొలిమేర -2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…“మా ఊరి పొలిమేర -2` పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు.
నటుడు సత్యం రాజేశ్ మాట్లాడుతూ…“ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన `మా ఊరి పొలిమేర ` చిత్రాన్ని ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్‌గా వస్తున్న `మా ఊరి పొలిమేర -2` త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్నికూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం. దర్శకుడు సీక్వెల్ ని అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత గౌరికృష్ణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు“ అన్నారు.
నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ “మా ఊరి పొలిమేర -2` చిత్రం ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. `మా ఊరి పొలిమేర `చిత్రాన్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. దానికి సీక్వెల్‌గా వస్తున్న `మా ఊరి పొలిమేర -2` చిత్రం మా బ్యానర్‌లో చేస్తున్నందుకు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ గారికి, మరియు నటీ నటులు అందరికీ ధన్యవాదాలు. అందరం ఒక ఫ్యామిలీ లాగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాము. దర్శకుడు `మా ఊరి పొలిమేర`ను మించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేస్తాము“ అన్నారు.
దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. `మా ఊరి పొలిమేర -2` ఫస్ట్‌లుక్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విడుదల చేయడం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నా. `మా ఊరి పొలిమేర` చిత్రాన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించారు. `మా ఊరి పొలిమేర` చిత్రానికి సిక్వెల్ ఉందా.. లేదా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానంగా `మా ఊరి పొలిమేర -2` ఫస్ట్ లుక్ లాంఛ్ చేయడం జరిగింది. ఈ చిత్రం విడుదల తేదీలను త్వరలోనే నిర్మాత గౌరికృష్ణ వెల్లడిస్తారు` అని అన్నారు.
డీఓపీ ఖుషేందర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. `మా ఊరి పొలిమెర ` చిత్రాన్ని ఓటీటీలో చూసి అమైజింగ్ గా ఫీల్ అయ్యాను. లక్కీగా `మా ఊరి పొలిమెర -2` చిత్రానికి డీఓపీ కావడం చాలా సంతోషంగా ఉంది. స్టోరి నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ అనిల్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అందుకు మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. `మా ఊరి పొలిమెర -2` ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై లెవెల్‌లో ఉంటాయి. మా నిర్మాత గౌరికృష్ణ ఎక్కడా కూడా ఖర్చుకు కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అందుకు వారికి నా ధన్యవాదాలు. సత్యం రాజేష్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే టీజర్‌తో మీ ముందుకు వస్తాము` అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వర; కో-డైరక్టర్ః ఆకుల నాగ్; పీఆర్వోః జికె మీడియా; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్.