అనుష్కతో పనిచేయడం అదృష్టం : నవీన్‌ పోలిశెట్టి!!

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాలో నేను అనుష్కతో కలిసి నటిస్తున్నాని తెలిసినప్పుడు పైకి పెద్దగా స్పందించలేదు కానీ, లోలోపల ఆనందంతో మాటల్లో వర్ణించలేదు. ఆమె నటించిన ’అరుంధతి’ నాకు ఇష్టమైన సినిమా. అలాంటిది ఆమెతో కలిసి నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. మేమే ఈ చిత్రం ఎందుకు చేశామన్నది సినిమా చూశాక మీకు తెలుస్తుందని నవీన్‌ పోలిశెట్టి అన్నారు.

ఆయన కథానాయకుడిగా అనుష్క కథానాయికగా నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 7న విడుదల కానుందీ సినిమా.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన (Naveen Polishetty)మాట్లాడుతూ ‘జాతిరత్నాలు’ సక్సెస్‌ని ముందే ఊహించాం. అయితే అంత భారీ విజయం సాధిస్తుందని ఏమాత్రం అనుకోలేదు. దీంతో ఆ తర్వాత ఎంచుకునే కథ ప్రేక్షకుల అంచనాలకు మించేలా ఉండాలన్న బాధ్యత నాపై పడిరది. ఈ క్రమంలో చాలా కథలు విన్నా. ఓ కథ విని వారాలు గడుస్తున్నా.. మళ్లీ మళ్లీ అదే గుర్తొస్తుందంటే అందులో ఓ మ్యాజిక్‌ ఉందని అర్థం.

మహేష్‌ ఈ కథ వినిపించాక నాకు అదే అనుభూతి కలిగింది. తను రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ జానర్‌లోనే ఇంతవరకు రాని ఓ విభిన్నమైన కథను సిద్థం చేశాడు. అది నాకు బాగా నచ్చింది. అలాగే మా జోడీ యూనిక్‌గా అనిపించింది. సినిమాలో నాకు, అనుష్కకి మధ్య నాన్‌స్టాప్‌ కామెడీ ఉంటుంది. తెరపై చూస్తేనే ఆ కిక్‌ తెలుస్తుంది. విజిల్స్‌ మోత మోగుతుంది. కృష్ణాష్టమి రోజు విడుదల కానున్న ఈ చిత్రం కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో.. మా చిత్రం కూడా అంతే అల్లరిగా ఉంటుంది.

ఇందులో స్టాండప్‌ కమెడియన్‌గా కనిపిస్తా.నిజమైన స్టాండప్‌ కామెడీ స్టూడియోలో చిత్రీకరణ జరిపాం. ట్రైలర్‌లో ఓ బోల్డ్‌ డైలాగ్‌ ఉంది. దానికి ఓ కారణం ఉంది. తెరపై చూసినప్పుడు మీరు దాన్ని ఎంజాయ్‌ చేస్తారు. గత ఏడాది ప్రారంభించిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకున్నాం. సినిమా నాణ్యత కోసం కాస్త టైమ్‌ తీసుకోవలసి వచ్చింది. దాని వల్లే గ్యాప్‌ వచ్చింది‘ అని అన్నారు. నా దృష్టిలో కథే సినిమాకు నిజమైన హీరో.

అదే అందరి కన్నా పెద్దది. అలాంటి పెద్ద కథల కోసమే నేనెప్పుడూ వెతుకుతుంటా. మంచి స్క్రీన్‌ప్లే, వినోదం.. ప్రేక్షకుల్ని ఆకర్షించే కొత్త అంశం.. ప్రస్తుతం తెలుగు సినిమా లెక్క మొత్తం మారిపోయింది. దానికి తెలుగు ప్రేక్షకులు సినిమాపై చూపించే ప్రేమే కారణం. కథ బాగుండి.. అందులో నా పాత్ర వైవిధ్యభరితంగా ఉంటే మరో స్టార్‌తో కలిసి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని నవీన్‌ పోలిశెట్టి అభిప్రాయపడ్డాడు.