మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం లైఫ్ లవ్ యువర్ ఫాదర్. మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ప్రొడ్యూసర్స్ గా వస్తున్న సినిమా LYF ‘Love Your Father’ మూవీ పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీ కెమెరా స్విచ్ ఆన్ చేసింది నెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని. క్లాప్ కొట్టింది సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు. స్క్రిప్ట్ నీ అందించింది గోపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం రెడ్డి మరియు సంతోష్ రెడ్డి. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భద్ర రెడ్డి గారు, మల్లారెడ్డి హెల్త్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ సి. హెచ్. ప్రీతి రెడ్డి గారు, మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ ఏ. రామస్వామి రెడ్డి గారు, హీరో శ్రీహర్ష, రియా, దర్శకుడు పవన్ కేతరాజు, నిర్మాతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, అన్నపురెడ్డి సామ్రాజ్యలక్ష్మి, ఎస్. పి. చరణ్, మణీంద్ర కుమార్ మరియు ఇతర కాలేజ్ ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ గారు మాట్లాడుతూ : 1983 నుంచి ఇప్పటివరకు మా మనిషా యాక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా లైఫ్ లవ్ యువర్ ఫాదర్ ఒక మంచి తండ్రి కొడుకుల మధ్యనున్న ఎమోషన్స్ని, బాండింగ్ ని చూపించే విధంగా ఉంటుంది. ఎనిమిది నెలలుగా ఐస్క్రిప్ట్ పైన కూర్చుని చాలా మంచిగా డెవలప్ చేసుకున్నాం. ఈ సినిమాకి మని శర్మ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. ఈ లైఫ్ మనకి దేవుడు ఇచ్చింది దేవుడు తర్వాత తండ్రి సో ఐ లవ్ మై ఫాదర్. మా నాన్నగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటాయి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో శ్రీహర్ష మాట్లాడుతూ : ఇది నా మొదటి సినిమా 100% కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తాను. మీ సపోర్ట్ మరియు ఆశీర్వాదాలు ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
రియా మాట్లాడుతూ : ఈ సినిమాలో నేను మేఘన క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ వచ్చినందుకు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి మెమరీ తీసుకెళ్తారు. ఈ సినిమాని మమ్మల్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఏ రామస్వామి రెడ్డి గారు మాట్లాడుతూ : మా అబ్బాయి శ్రీహర్షాన్ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంటుంది ఎమోషన్, లవ్ ఉంటుంది అండ్ శివుడి పైన మంచి పాట కూడా ప్లాన్ చేసాం. మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ట్యూన్స్ విన్నాను. స్క్రిప్ట్ అంతా చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగా ప్లాన్ చేసారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ : గతంలో కో డైరెక్టర్ గా చాలా సినిమాలకు వర్క్ చేశాను. కిషోర్ రాఠీ గారు నన్ను స్వయంగా పిలిచి ఈ సినిమా నాకు ఇవ్వడం జరిగింది. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ గారు నన్ను పిలిచే అవకాశం చాలా ఆనందంగా ఉంది. కిషోర్ రాఠీ గారి లైఫ్ లోని చిన్న ఇన్సిడెంట్ ని తీసుకునే కాదని డెవలప్ చేసుకోవడం జరిగింది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా లైఫ్ ‘లవ్ యువర్ ఫాదర్’. అదేవిధంగా శివోహం కాన్సెప్ట్ ని తీసుకుని ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాం. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన కిషోర్ రాఠీ గారికి, మహేష్ రాఠీ గారికి, రామస్వామి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
డిఓపి మణీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ : నేను బాలీవుడ్ కెమెరామెన్ ని కానీ తెలుగులో ఇది నా మొదటి సినిమా. శివుడి మీద ఒక మంచి కాన్సెప్ట్ తో తండ్రి కొడుకులు మధ్యలో ఎమోషనల్ బాండ్ ని చూపిస్తూ ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనీషా ఫిలింస్ బ్యానర్ నిర్మాత కిషోర్ రాఠీ గారికి దర్శకుడు పవన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
తారాగణం : శ్రీహర్ష, కషిక కపూర్, SPచరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్ మరియు అమన్ వేమ తదితరులు
నిర్మాతలు : కిషోర్ రాఠీ, మహేశ్ రాఠీ,
అన్నపురెడ్డి సామ్రాజ్యలక్ష్మి
బ్యానర్ : మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
దర్శకుడు : పవన్ కేతరాజు
డిఓపి : మణీంద్ర కుమార్
సంగీత దర్శకుడు: మణిశర్మ
ఎడిటర్: అమర్రెడ్డి కుడుముల
PRO : మధు