టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. మేకర్స్ ఇప్పటివరకు రెండు పాటలు, టీజర్‌ను విడుదల చేశారు. మీటర్ ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని పాటలు, టీజర్ భరోసా ఇచ్చాయి.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఎవరినీ పట్టించుకోని, తన స్వంత రూల్స్ ప్రకారం జీవితాన్ని ఆస్వాదించే రెక్లెస్ పోలీసుగా కిరణ్ అబ్బవరం యాక్షన్-ప్యాక్డ్ ఎంట్రీతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కిరణ్ తనను ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అతను చాలా డేంజరస్, పవర్ ఫుల్ రాజకీయ నాయకుడితో గొడవ పడతాడు. బ్యాచ్‌లో టాపర్‌గా ఉన్న ఈ పోలీసు అధికారి తన తండ్రి ప్రేరణతో తన డ్యూటీని సీరియస్‌గా తీసుకుంటాడు.
రమేష్ కడూరి కమర్షియల్ గా కమర్షియల్ వయబుల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. కిరణ్ అబ్బవరం పోలీసు పాత్రను చాలా యీజ్ తో చేశాడు. తనదైన నటనతో కావాల్సిన వినోదాన్ని అందిస్తుంది. అతుల్య రవి గ్లామ్ డాల్‌గా కనిపించింది. మిగతా నటీనటులు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు.
విజువల్స్ గ్రాండ్‌గా అనిపించాయి, సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ సి దిలీప్ అద్భుతమైన వర్క్ చేశారు. సాయి కార్తీక్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో విజువల్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మీటర్ మీరు ఊహించినదాని కంటే మాస్ డబుల్ ట్రిపుల్ వుంటుంది. అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. నేను పరిశ్రమలోకి వచ్చింది ఐదేళ్ళు అవుతుంది. మీ అందరి అభిమానంతో ఈ ఐదేళ్ళు అద్భుతంగా గడిచింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, అభిమానులకు, దర్శక నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, మీడియాకి.. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇప్పటివరకూ నేర్చుకున్న అనుభవాలతో మీకు మరిన్ని మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సినిమా చేయడం కష్టం. అందులో మీటర్ లాంటి కమర్షియల్ సినిమా చేయడం ఇంకా కష్టం. 75 రోజుల పాటు రేయింబవళ్ళు కష్టపడి షూట్ చేశాం. భారీ ఫైట్స్, సెట్స్, నిర్మాణ విలువలతో ఇంత పెద్ద సినిమాని ఇంత తొందరగా పూర్తి చేశామంటే కారణం మా టెక్నిషియన్స్. నిర్మాత చెర్రీగారికి కృతజ్ఞతలు. మీటర్ నాకు చాలా స్పెషల్ మూవీ. ఎందుకు ఇంత ప్రత్యేకమో ఏప్రిల్ 7న అర్ధమౌతుంది. పాటలు టీజర్ ట్రైలర్ చూసిన వారంతా కిరణ్ కి చాలా పెద్ద సినిమా పడందని అంటున్నారు. వంద శాతం నాకు నమ్మకం వుంది. ఎన్ని అంచనాలతో థియేటర్ లోకి వచ్చినా ఆ అంచనాలని అందుకునేలా వుంటుంది. టీజర్ ట్రైలర్ ఎలా గ్యాప్ లేకుండా పరిగెత్తాయో సినిమా కూడా అదే మీటర్ లో పరిగెడుతుంది. ఇది మంచి కమర్షియల్ సినిమా. ఊపు ఉత్సాహం కలగలిపితే మీటర్. థియేటర్ లో మీటర్ చాలా గట్టిగా వుంటుంది” అన్నారు
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఇప్పటివరకూ కమర్షియల్ సినిమా చేయలేదు, కొంచెం ప్రయోగాత్మక చిత్రాలే చేశాను. రమేష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా బలమైన సబ్జెక్ట్ అనిపించింది. మాస్ కమర్షియల్ స్టయిల్ లో వుంటుందని అర్ధమైయింది. రమేష్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. విజువల్స్ చూసినప్పుడు అసలు కొత్తదర్శకుడని అనిపించదు. అత్యుల రవి అద్భుతంగా చేసింది. చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. కిరణ్ ఫస్ట్ టైం ఇంత మాస్ కమర్షియల్ స్టయిలీష్ గా చూడబోతున్నారు. ఈ సినిమాతో ఆయన పెద్ద హీరో అవుతారు. సాయి కార్తిక్ కు ఈ సినిమా కమ్ బ్యాక్ సినిమా అవుతుంది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసే మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు” తెలిపారు.
అతుల్య రవి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమాలో నన్ను పరిచయం చేసిన మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు జీవితాంతం రుణపడి వుంటాను. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం అనే స్నేహితుడు దొరికాడు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మాస్ మీటర్ స్టార్ట్ అవుతుంది(నవ్వుతూ). టీం అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న మీటర్ విడుదలౌతుంది. అందరూ థియేటర్ కి వెళ్లి చూసి మాకు సపోర్ట్ చేయండి” అన్నారు
దర్శకుడు రమేష్ కడూరి మాట్లాడుతూ.. మీటర్ టీజర్, పాటలు, ట్రైలర్ అదిరిపోయాయి. సినిమా ఇంకా అదిరిపోతుంది. మాములుగా వుండదు. ఏప్రిల్ 7 నుంచి అసలైన సమ్మర్ స్టార్ట్ అవుతుంది. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన నిర్మాత చెర్రీ గారికి కృతజ్ఞతలు. కిరణ్ అబ్బవరం కు థాంక్స్. అతుల్య ఈ సినిమాతో తెలుగులో బిజీ అయిపోతుంది. ఈ సినిమాని పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు. ఈ ఈవెంట్ మీటర్ చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెవి ఆర్ట్ డైరెక్టర్. అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ కాగా, బాబా సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్లీ సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి బాల్ సుబ్రమణ్యం కెవివి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: రమేష్ కడూరి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సమర్పకులు: నవీన్ యెరనేని, రవిశంకర్ యలమంచిలి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సాయి కార్తీక్
డీవోపీ: వెంకట్ సి దిలీప్
ప్రొడక్షన్ డిజైనర్: JV
డైలాగ్స్: రమేష్ కడూరి, సూర్య
లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబా సాయి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం KVV
ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కందుల
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: మధు మాడురి, వంశీ-శేఖర్